Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Shani uday 2023: కుంభరాశిలో ఉదయించనున్న శని, ఈ రాశుల వారికి అదృష్టం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2023 జనవరి నెలలో అస్తమించిన శని దేవుడు, తిరిగి మార్చి 6వ తేదీన ఉదయించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శని దేవుని ఆశీస్సులు పొందనున్నారు.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక మానవ జీవితంలో ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు తమ రాశిని మారినప్పుడు మానవ జీవితం ప్రభావితమవుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో శని గ్రహాన్ని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం స్థానంలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా మానవ జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. 30 ఏళ్ల తర్వాత శని దేవుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. జనవరి 17, 2023న శని గ్రహం కుంభరాశిలో ప్రవేశించి, జనవరి 30వ తేదీన అస్తమించాడు. ఇప్పుడు హోలీకి రెండు రోజుల ముందు కుంభరాశిలో ఉదయించనున్నాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశిలోనే ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మంచి జరగనుంది. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశిలో శని ఉదయించడం 2023: తేదీ, సమయం
జనవరి 30, 2023లో కుంభరాశిలో అస్తమించిన శని.. మార్చి 6, 2023 శనివారం రాత్రి 11.36 గంటలకు కుంభరాశిలో శని ఉదయించనున్నాడు.

వృషభం:
కుంభరాశిలో శని ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి కాలం కలిసి రానుంది. ధనలాభం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఈ సమయం ఉత్తమ సమయంగా పరిగణించబడుతోంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సంపద సృష్టించవచ్చు.

సింహం:
కుంభరాశిలో శని ఉదయించడంతో సింహ రాశి వారికి ప్రయోజనం చేకూరనుంది. శని దేవుని ఆశీర్వాదం పొందుతారు. సూర్యుడు సింహ రాశి చక్రానికి అధిపతి, శని సూర్యుడు స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటారు కాబట్టి ఆ ప్రభావం సింహ రాశి వారిపై ఉంటుంది. ఈ సమయంలో తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పురోగతి లభి్తుంది. గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కుంభరాశి:
కుంభరాశిలో అస్తమించిన శనిదేవుడు.. మళ్లీ అదే గ్రహంలో ఉదయించనున్నాడు. దీని వల్ల కుంభ రాశి వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో కుంభరాశి వారు వ్యాపారంలో ఉంటే వారికి మంచి లాభాలు అందుతాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.



Click it and Unblock the Notifications