Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫిక్స్ అయిపోండి.. 2025లో శనీశ్వరుడు కుబేరులను చేసేది వీరినే! పేపర్ పట్టుకున్నా డబ్బు అయిపోతుంది!
శనీశ్వరుడి కారణంగా ఏర్పడే అత్యంత శక్తివంతమైన, అరుదైన యోగాల్లో శష మహాపురుష యోగం ఒకటి. శనీశ్వరుడు తన సొంత ఇంటిలోకి వచ్చినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ బలం ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు ఈ యోగ బలం ఉన్న వ్యక్తులకు వరాల జల్లు కురిపిస్తాడు. సంపద పెరుగుతుంది, వృత్తి, వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో చికాకులు కూడా దూరమవుతాయి. ఇంతకీ ఏ రాశుల వారికి ఈ శష మహాపురుష యాగం పట్టుకుంటుందో తెలుసుకుందాం. కాగా 2025లో కూడా ఈ యోగ ఫలాలు కొనసాగనున్నాయి
వృషభం
వృషభ రాశి వారికి శని వల్ల కలిగే ఈ శష మహాపురుష రాజయోగం కలగనుంది. దీని వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. డబ్బులు వద్దా వచ్చి ఇంట్లో పడుతుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలను చూస్తారు. సమాజంలో గౌరవడం పెరగడంతో పాటు ఇంట్లో సమస్యలు పరిష్కారమవుతాయి.

కన్య
ఈ కన్య రాశి వారికి శష మహాపురుష యోగం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా వీరిలో నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ యోగ బలం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ వృత్తి జీవితంలోని లక్ష్యాలను సాధించుకుంటారు. ఆర్థికంగా ఈ కాలం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆర్ధిక స్థిరత్వం ఉండడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
తులా
ఈ రాశి వారికి కూడా శష మహాపురుష యోగం ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ యోగ కాలం ఉన్నన్ని రోజులు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనుకోని విధంగా ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో మునుపెన్నడూ లేని లాభాలను చవిచూస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నా వ్యక్తులకు ఇది గొప్ప సమయం.
మకర
శష మహాపురుష యోగం కారణంగా మకర రాశి వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాజయోగ ప్రభావం కారణంగా, వీరి ఆర్థిక స్థితిలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. కెరీర్‌లో అన్ని పనులు మీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి.
కుంభ
ఈ శష మహాపురుష రాజయోగం కుంభ రాశిలోనే ఏర్పడుతుంది. శని సడేతి ప్రభావం ఈ రాశి వారిపై ఉన్నప్పటికీ ఈ యోగ బలం వల్ల శని అదృష్ట గ్రహంగా మారనున్నాడు. ఈ కాలంలో మీరు కెరీర్, వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ వృత్తి జీవితంలో సవాళ్లు తొలగిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications