Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
షష్టగ్రహ కూటమి.. 30వ తేదీ తరువాత ఈ 3 రాశుల వారికి అంతా రాజయోగమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక, గ్రాహాల రాశి మార్పులు అనేవి సర్వసాధారణం. గ్రహాల కలయిక, గ్రహాల కూటముల కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తే, మరికొన్ని రాశుల వారికి మాత్రం కచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే మార్చి నెల చివరలో షష్టగ్రహ కూటమి ఏర్పాటు కానుంది. ఆరు గ్రహాలు తమ తమ 12వ స్థానమైన మీనరాశిలో కలుసుకోనున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయని ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు దేవరకొండ ఉమా వెల్లడించారు. అయితే ఏ రాశుల వారికి ఈ షష్టగ్రహ కూటమి కారణంగా మంచి ఫలితాలు వస్తాయి? ఏ విధమైన ఫలితాలను వారు పొందుతారు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పుడు ఈ కూటమి ఏర్పడుతుందంటే?
మార్చి నెల చివరలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడనుంది దేవరకొండ ఉమా వెల్లడించారు. మార్చి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ షష్టగ్రహ కూటమి ఉండబోతుంది. ఇప్పటికే మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు సంచరిస్తున్నారు. అయితే మార్చి 15వ తేదీ తరువాత వారితో రవి కూడా జతకట్టబోతున్నాడు. ఆ తరువాత ఇప్పటికే రవితో కలిసి సంచారం కొనసాగిస్తున్న శని కూడా మీనరాశిలోకి ప్రవేశించడంతో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది.

ఏ రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయంటే?
వృషభ రాశి
ఈ షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టుకోనుంది. ఎందుకంటే ఈ రాశి వారికి తమ 11వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న దోషాలన్నీ తొలిగిపోతాయి. వివాహం కానీ వ్యక్తులకు వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి. అలాగే సంతానలేమితో ఇబ్బందిపడుతున్న వ్యక్తులకు కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశికి చెందిన వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ కాలంలో ఈ రాశి వారు ఎలాంటి రిస్క్ తీసుకున్నా అద్భుతమైన లాభాలు పొందుతారు.
తులా రాశి
తులారాశి వారికి కూడా ఈ షష్టగ్రహ కూటమి వలన అనేక మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి తమ ఆరో స్థానంలో ఆరుగ్రహాల కూటమి ఏర్పడడం వలన వీరికి అంతా మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఒక్కసారిగా అన్ని అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులకు, విదేశాల్లో ఉన్న వారికి శుభవార్త లభిస్తుంది. వివాహ సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా మంచి పదవి లభిస్తుంది. వీరికి ఆర్థికపరమైన అంశాలు అన్నీ కలిసి వస్తాయి. డబ్బు లోటును వీరు తీర్చుకుంటారు.
మకర రాశి
ఈ రాశి వారికి తమ మూడో స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఈ కూటమి వలన రాజయోగ ఫలితాలు లభించనున్నాయి. ఈ రాశి వారి జీవితంలో ఒక మ్యాజిక్ ఏర్పడుతుంది. ఆర్థికపరమైన అంశాలు అన్నీ కలిసి వస్తాయి. ఏ పని చేసినా డబ్బు విపరీతంగా వస్తుంటుంది. ఉద్యోగం మారాలనుకునే వ్యక్తులకు భారీ జీతంతో ఉద్యోగం లభిస్తుంది. వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తులకు మంచి సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి వలన చేపట్టబోయే పనులన్నీ పూర్తవుతాయి. అలాగే అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications