Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
త్వరలో శుక్రగ్రహ అస్తమయం, ఈ రాశి వారికి కష్టాలు, ఆర్థిక సమస్యలు తప్పవు
శుక్రుడు సంపదకు, ప్రేమకు, ఆనందానికి, విలాసానికి అధిపతిగా పరిగణిస్తారు. శుక్ర గ్రహ సంచారం అన్ని గ్రహాలపై, అందరిపై పడుతుంది. శుక్ర అస్తమయం, ఉదయం విపరీతమై ప్రభావాన్ని చూపిస్తుంది. వచ్చే నెలలో శుక్రుడు అస్తమించనున్నాడు. శుక్రుని కదలికలో మార్పు వచ్చినప్పుడు అది కచ్చితంగా ఒకరి విలాసవంతమైన జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది.

సంపదకు, కీర్తికి కారకుడైన శుక్రుడు వచ్చే నెల అంటే ఆగస్టు 4, 2023న అస్తమించనున్నాడు. ఈ అస్తమ ప్రభావం 3 రాశుల వారిపై తీవ్రంగా ఉండనుంది. అందుకే వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. వైవాహిక జీవితం, డబ్బు పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
శుక్రుడు అస్తమించడం సింహ రాశి వారికి హానికరంగా మారనుంది. శుక్ర గ్రహం సింహ రాశి నుంచి లగ్న గృహంలో అస్తమించబోతున్నాడు. సింహ రాశిలోని 3వ, 10వ ఇంటికి శుక్రుడు అధిపతి. ఇప్పుడు శుక్రుని అస్తమయం సింహ రాశి వారిపై ఉంటుంది. అందుకే ఈ సమయంలో సింహ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదే సమయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ సమయంలో తోబుట్టువులతో కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జూనియర్లు, సీనియర్ల నుంచి ఏమాత్రం మద్దతు పొందలేరు.
మీన రాశి:
శుక్రుడు అస్తమించడం మీన రాశి వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. శుక్ర గ్రహం.. కర్కాటక రాశి వారికి డబ్బుకు, మర్యాదను తెచ్చిపెట్టే గ్రహం. అలాంటి గ్రహం అస్తమించడం వల్ల మీన రాశి వారు నష్టపోవచ్చు. ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉంటుంది. రహస్య శత్రువుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఛాతీ లేదా గొంతుకు సంబంధించిన ఏదైనా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా.. ఈ సమయంలో మీన రాశి వారి వాహనాలు జాగ్రత్తగా నడపాలి. ఎవరికీ రుణం ఇవ్వకుండా నియంత్రించుకోవడం ముఖ్యం. అప్పుగా ఇచ్చిన డబ్బును మర్చిపోవాల్సిందే.
కర్కాటక రాశి:
శుక్ర గ్రహం అమరిక కర్కాటక రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుంచి డబ్బు, ప్రసంగంలో సెట్ అవుతుంది. అందుకే ఈ సమయంలో డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కీర్తి నష్టపోవచ్చు. వ్యక్తులతో విభేదాలు వస్తాయి. ఈ సమయంలో ఇంట్లోని కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. శుక్ర అస్తమయం వ్యాపారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో వాహన, ఆస్తి లావాదేవీలు నివారించాలి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినా సమస్యలు ఎదుర్కొంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications