Latest Updates
-
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్రూట్ జున్ను.! -
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.? -
హిందూ ధర్మంలో క్షేత్రపాలక దేవతల పాత్ర ఏమిటి? -
వృశ్చిక రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త! -
ఇడ్లీ, దోశలు కాదు..జుట్టు రాలడం తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచే సూపర్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కరివేపాకు ఉప్మా..
Shukra Dosha Nivarana: కష్టపడి సంపాదిస్తున్నా.. రూపాయి కూడా మిగలడం లేదా? శుక్రదోషం కావొచ్చు.. ఈ నివారణలు పాటిం
నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి ప్రముఖమైన స్థానం ఉంది. జ్యోతిష్యంలో శుక్రుడు ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఆనందం, ఆర్థికాన్ని శుక్రుడు ప్రభావితం చేస్తాడు. శుక్రుని స్థానం అనుకూలంగా ఉంటే మానసికంగా సంతోషంగా ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా బాగుంటుంది. శుక్రుడు అనుకూలించకపోతే ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా ఉండదు. వచ్చే ఆదాయం బాగున్నా.. అది చేతిలో ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒకటి వచ్చి ఆదాయాన్ని అంతా ఖాళీ చేస్తుంది. నెల చివరికి వచ్చే సరికి రూపాయి కూడా లేకుండా అయిపోతుంది.

జాతకంలో శుక్రుని స్థానం అశుభం అయితే, స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆనందం ఉండదు. అదృష్టం కలిసి రాదు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, లైంగిక సమస్యలు, అనారోగ్యం, ధన నష్టం, ఆర్థిక సమస్యలు, ఫలితం దక్కినా ప్రయోజనం శూన్యం ఇలా చాలా సమస్యలు వేధిస్తాయి. జ్యోతిషం ప్రకారం ఈ సమస్యలను సమయానికి గుర్తించి కొన్ని నివారణ చర్యలు పాటిస్తే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.
మురికిగా ఉంటారు, శుభ్రత నచ్చదు:
జాతకంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే అది బాహ్యంగా చూపిస్తుంది. మానసిక, కుటుంబ, ఆర్థిక సమస్యలతో శుక్ర దోషం గురించి తెలుసుకోవచ్చు. ఆదాయం వస్తున్నా దాని ఫలితం లేకపోతే శుక్ర దోషంగా అనుమానించవచ్చు. అలాగే శుక్ర దోషం ఉన్న వ్యక్తులు మురికిగా ఉండటానికి ఇష్టపడతారు.
శుభ్రత జోలికి వెళ్లరు. ఉతకని బట్టలు వేసుకోవడం, మరకలు అంటుకున్నా పెద్దగా పట్టించుకోకపోవడం, చింపిరి జుట్టు, నెరసిన గడ్డం ఇలా మురికిగా ఉంటారు. ఎప్పుడూ శుభ్రతను పాటించే వారిలో కూడా కొన్ని అలవాట్లు మారినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. శుక్ర దోషం వల్లే ఇలా జరుగుతుందని గ్రహించాలి.
స్త్రీలకు ఆకర్షణ తగ్గుతుంది. రోజూ శృంగారంలో పాల్గొంటున్నా లైంగిక సంతృప్తి ఉండదు. వైవాహిక జీవితంలోనూ అసంతృప్తి స్పష్టంగా గోచరిస్తుంది. అన్నీ ఉన్నా.. లేని దాని గురించే ఆలోచిస్తూ మదన పడిపోతూ ఉంటారు.
లైంగిక కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి:
అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య క్రమంగా దూరం పెరుగుతుంది. కారణం లేకుండా భాగస్వామి పట్ల కోపం వస్తుంది. ఇది సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ ప్రభావం లైంగిక జీవితంపై పడుతుంది. దాని వల్ల శృంగారం పాల్గొనడం తగ్గుముఖం పడుతుంది. అలాగే అనారోగ్య కారణాల వల్ల కూడా శృంగారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
చర్మ సంబంధిత సమస్యలు, కాలేయ సమస్యలు, చేతులు, కాళ్లు, వెన్నెముక నొప్పి ఇబ్బంది పెడుతుంది. కాసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ సతమతం చేస్తుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల మద్యపానానికి బానిస అవుతారు. ధూమపానం అలవాటు అవుతుంది. జూదం ఆడటం ప్రారంభిస్తారు లేదా మరింత ఎక్కువగా ఆడుతుంటారు.
శుక్ర స్థానం బలపడాలంటే ఏం చేయాలి?:
జాతకంలో శుక్రుని స్థానం బలపడాలంటే పెరుగు, పాలు, జున్ను, కీర్, బట్టలు, వెండి, బియ్యం మొదలైన తెల్లటి రంగులో ఉన్న వస్తువులను పేదలకు దానం చేయాలి. దీని వల్ల శుక్ర దోషం నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. జాతకంలో శుక్ర స్థానాన్ని బలోపేతం చేయడానికి శుక్ర బీజ్ మంత్రాన్ని పఠించాలి. 'ఓం ద్రన్ డ్రిన్ ద్రౌన్ సః శుక్రయ నమః' అనే మంత్రాన్ని రోజూ పఠించాలి. అలాగే 'ఓం శుక్రాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
6, 13 ముఖాల రుద్రాక్షలు:
శుక్ర దోషం తొలగిపోవడానికి 6 లేదా 13 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ధరించాలి. ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు ఓం హ్రీ నమః ఓం రామ్ మన్ యం అనే మంత్రాన్ని జపించాలి.
వజ్రం ధరించినా ఫలితం ఉంటుంది. మణి, కురంగి, జార్కాన్ ధరించవచ్చు. అలాగే శుక్రవారం రోజు సర్పంఖ లేదా అరండ్ మూల్ ధరించడం వల్ల శుక్రగ్రహ దుష్ఫలితాలు పోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి శ్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications