Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మహా అద్భుతం..బిచ్చగాడిని కూడా చక్రవర్తిని చేసే రాహు-శుక్ర యోగం!..ఈ 3 రాశుల వారి లైఫ్ సెటిల్!
జ్యోతిష్యశాస్త్రంలో రాహువును సాధారణంగా పాప గ్రహంగా, అశుభ గ్రహంగా పరిగణిస్తుంటారు. రాహువు అసంతృప్తిగా ఉంటే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందని భయపడతారు. అయితే రాహువు కరుణిస్తే బిచ్చగాడిని కూడా చక్రవర్తిని చేస్తాడు. అటువంటి అరుదైన, అద్భుతమైన సమయం 2026లో రాబోతోంది.
రాక్షస గ్రహమైన రాహువు..అసుర గురువు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడితో కలవబోతున్నాడు. ఈ మహా కలయిక కొన్ని రాశుల వారి జీవితాల్లో కనీవినీ ఎరుగని మార్పులను తీసుకురానుంది.

గ్రహాల స్థితిగతులు ఇలా ఉండబోతున్నాయి
ప్రస్తుతం శని క్షేత్రమైన కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 6,2026న అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారుజామున 01:15 గంటలకు శుక్రుడు మకర రాశిని వీడి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ తిష్టవేసి ఉన్న రాహువుతో శుక్రుడు జతకడతాడు.
ఈ శుక్ర-రాహు యుతి మార్చి 2, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సుమారు నెల రోజుల కాలం అఖండ ధన యోగాన్ని సృష్టించబోతోంది. రాహువు ఇచ్చే సంపద అనంతమైనది, దానికి శుక్రుడి విలాసం తోడైతే ఇక తిరుగుండదు.ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఈ సమయం ఒక వరంలా మారనుంది.
మేష రాశి
మేష రాశి వారికి రాహు-శుక్రుల కలయిక ఒక అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతోంది. మీ జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగిపోయి, ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఎప్పటి నుండో సొంత ఇల్లు లేదా ఖరీదైన కారు కొనాలని చూస్తున్న మీ కలలు ఈ సమయంలో నెరవేరుతాయి.
ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. కెరీర్ పరంగా ఇది మీకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా కలిసిరానుంది. మీ జాతకంలో ఈ గ్రహాల కలయిక వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులు ఓడిపోతారు. ఆర్థికంగా మీరు ఎంతో బలపడతారు.
పాత అప్పులన్నీ సులభంగా తీర్చగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ జీవితాన్ని కొత్తగా, ఆనందంగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
కుంభ రాశి
ఈ మహా కలయిక మీ రాశిలోనే (కుంభం) జరుగుతోంది కాబట్టి దీని ప్రభావం మీపై అత్యధికంగా ఉంటుంది. రాహువు, శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ ఆకర్షణ పెరుగుతుంది. పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి.
ఆదాయ మార్గాలు పెరిగి, చేతి నిండా డబ్బు ఉంటుంది. జీవితంలో భద్రత సుఖసంతోషాలు నెలకొంటాయి. గతం కంటే మెరుగైన రోజులను మీరు చూడబోతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications