కుంభరాశిలో శుక్ర-శని సంయోగం; ఈ 6 రాశుల వారికి బంపర్ ఆఫర్

కుంభరాశిలో శుక్ర-శని సంయోగం; ఈ 6 రాశుల వారికి బంపర్ ఆఫర్

జ్యోతిషశాస్త్రపరంగా 30 సంవత్సరాల తరువాత, శని యొక్క సొంత రాశి అయిన కుంభరాశిలో శుక్రుడు మరియు శని గ్రహాలు సంచారం చేశాయి. ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ జనవరి 22వ తేదీ ఉదయం శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. జనవరి 17 నుంచి కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈ గ్రహాలు రెండూ ఒకే రాశిలో ప్రవేశంచడం అరుదైన కలయిక మరియు శుభసూచకం.

shukra shani yuti 2023 venus saturn conjunction in aquarius will be lucky for these zodiac signs

30 ఏళ్ళ తర్వాత శన తన సొంత రాశి అయిన కుంబరాశిలోకి సంచారంతో శుక్ర మరియు శని ఉనికి శుభప్రదం మరియు ఫలప్రదంగా పరిగనించబడుతుంది. కుంభరాశిలో ఈ ద్విగ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని మరియు శుక్ర ద్విగ్రహాల కలయిక స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు వ్యతిరేక స్వభావం ఉన్న గ్రహాలు అయినప్పటికీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. జనవరి 22 నుండి శుక్రుడు మరియు శని గ్రహాల కలయిక వల్ల లాభాన్ని మరియు పురోగతిని పొందే 6 రాశుల వారు ఎవరో తెలుసుకోవడానికి కథనాన్ని చదవండి.

మేషరాశి

మేషరాశి

కుంభ రాశిలో ద్విగ్రహ కలయిక సంచారంతో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. జీవితం సంతోషంగా..సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి మరియు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. అలాగే చాలా కాలంగా ఎదురుచూస్తున్న కెరీర్ అవకాశాలను పొందుతారు. విద్యార్థులు కూడా మంచి ప్రయోజనం పొందుతారు. పోటిపరీక్షల్లో మీదే విజయం. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటారు. అన్నీరకాలుగా మీరు సంతోషంగా ఉండాలంటే మీరు ప్రతి శుక్రవారం మీ పర్సులో వెండి నాణేన్ని ఉంచుకోండి.

వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశిపై శుక్ర, శని కలయిక చాలా శుభాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి. వినోద రంగంలో ఉన్నవారికి విశేష ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కారణంగా ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.అలాగే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంకా ఇంటి అవసరాలకు సంబంధించిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు అన్నింట్లో విజయం సాధించడానికి మీరు ఈసారి డైమండ్ రింగ్ ధరిస్తారు.

మిధునరాశి

మిధునరాశి

మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆర్థిక పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ సమయం చాలా శుభప్రదం. మీరు ఏపని చేపట్టినా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పని పరంగా దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు మీకు ఇష్టమైన పనులు చేయడానికి సమయాన్ని వెచ్చించవచ్చు. తోబుట్టువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ జీవితంలో సంతోషం కోసం పరిహారంగా ప్రతి శుక్రవారం తామరపువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి.

సింహ రాశి:

సింహ రాశి:

కుంభ రాశిలో శుక్ర, శని ద్విగ్రహాల కలయిక ద్వారా సింహరావి వారికి చాలా మేలు జరుగుతుంది. పార్ట్నర్ షిప్ తో వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా గొప్ప అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుంటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మరిన్ని ఉత్తమ ఫలితాల కోసం మీ పడకగదిలో గులాబీ రాయిని ఉంచండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఈ రెండు రాశుల సంయోగం వృశ్చికరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు విలాసవంతమై వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ సౌకర్యాలను మెరుగుపరచడానికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారంలో గొప్ప అభివృద్ధి ఉంటుంది మరియు అదృష్టం మీ తలుపు తడుతుంది. వినోద రంగానికి సంబంధించిన వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. పరిహారంగా ప్రతి శుక్రవారం తెల్ల ధాన్యాలను దానం చేయండి.

మకరరాశి

మకరరాశి

ఈ రాశి వారికి ద్విగ్రహాల కలయిక వల్ల ధన బలం పెరుగుతుంది. దాని వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారు వాక్ చాతుర్యం తో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ పనిలో మీస్థానాన్ని పెంచుకోవచ్చు. మీ భాగస్వామితో మీ సంబంధం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితంలో, ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబ సభ్యులు లేదా ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. మీ అత్తమామలతో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.

Story first published: Wednesday, January 25, 2023, 16:53 [IST]
Desktop Bottom Promotion