Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అర్థకేంద్ర రాజయోగం.. ఇక నుంచి ఈ మూడు రాశుల వారు మహరాజులా జీవిస్తారు
2025లో మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజున ఎన్నో కర్మలకు కారణమయ్యే శని, బుధుడితో కలుస్తున్నాడు. దీని కారణంగా శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. అయితే మూడు రాశుల వారిపై మాత్రం ఈ రాజయోగం ఫలితాలు స్పష్టంగా కనిపించబోతున్నాయి. ఆ రాశులు ఏవి? వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
మేషరాశి
శని, బుధ గ్రహాల వల్ల ఏర్పడిన అర్థకేంద్ర యోగం మేష రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. మేష రాశిలో శని పదకొండవ స్థానంలో, బుధుడు దశమ స్థానంలో ఉంటారు. ఇది ఈ రాశి వారి వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారి వాక్చాతుర్యం శక్తివంతం అవుతుంది. దీని కారణంగా వారు ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు.

ఉద్యోగ సంబంధించిన పని కోసం దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ ప్రయాణాల వలన గొప్ప ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి వారి తల్లిదండ్రుల పూర్తి మద్దతు ఉంటుంది. దీని కారణంగా, వారు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అర్థకేంద్ర యోగం చాలా మేలు చేస్తుంది. బుధ, శని గ్రహాలు ఈ రాశిలో కలుసుబోతున్నారు. దీని కారణంగా ఈ రాశి వారు తమ వృత్తి జీవితాల్లో గొప్ప ప్రయోజనాలను పొందుతారు. జాయింట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టిన వ్యాపారవేత్తలు ఈ కాలంలో చాలా లాభాలను ఆర్జించవచ్చు. విదేశాలలో ఉన్న ఉద్యోగార్ధులు ఈ కాలంలో సరైన ఉద్యోగాన్ని పొందుతారు. దీంతో పాటు వారి భాగస్వామితో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది.
మకర రాశి
అర్థకేంద్ర యోగం మకరరాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశికి చెందిన వారు వారు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించగలుగుతారు. తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. అలాగే వారు ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట స్థానాల్లో రాజయోగం ఏర్పడటం వలన, దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను ఆశించవచ్చు. వారు వివిధ మార్గాల్లో విజయ పథాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు ఇప్పుడు తీరుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications