Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అత్యంత అరుదైన సర్వ సిద్ధి యోగం.. నాలుగు రాశుల వారిపై సాక్షాత్తు వినాయకుడి అనుగ్రహం!
2025లో అనేక గ్రహాల గమనంలో మార్పులు వస్తున్నాయి. చాలా గ్రహాలు తమ కదలిక దిశను మార్చుకుంటున్నాయి. అలాగే చంద్రుడు కూడా తన రాశిని మార్చుకుంటున్నాడు. చంద్రుడు కుంభ రాశిలోకి వెళ్లబోతున్నాడు. అయితే శని ఇప్పటికే కుంభరాశిలో ఉండటం వల్ల సర్వ సిద్ధి యోగం కూడా కలుగుతుంది. ఈ సర్వసిద్ధి యోగం చాలా రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురానుంది. ఆ రాశుల వారికి అన్ని విధాలా పనులు పూర్తికానున్నాయి. డబ్బు పరంగా కూడా అన్ని విధాలుగా కలిసిరానుంది. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథునరాశి వారికి సిద్ధి యోగం వల్ల పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఆ ఉద్యోగంలో కచ్చితంగా లాభపడతారు. మీరు అనుకున్నట్లుగా, మీ కోరిక మేరకు మీకు ఉద్యోగం దొరుకుతుంది. అనేక రకాల బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారం రంగంలో కూడా ఇతరుల నుంచి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం మానుకోండి.

ధనుస్సు రాశి
ఈ యోగం బలంతో పాటు ఈ రాశి వారికి ఉన్న తెలివితేటల కారణంగా ధనుస్సు రాశివారు తమ పనితో ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. ఈ రాశి వారి కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమికుల మధ్య మంచి సయోధ్య కుదురుతుంది. అవివాహితులకు మరింత లాభదాయమైన రోజులు రానున్నాయి. మీ తదుపరి పనులపై మరింత దృష్టి పెట్టాలి. ఇది మీ భవిష్యత్తు కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడుతుంది.
మకర రాశి
సర్వ సిద్ధి యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభదాయకమైన రోజులు రానున్నాయి. పాత అప్పులు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఆస్తి, సంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు అంతరాయం లేకుండా నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో శాంతి నెలకొంటుంది. మీరు భాగస్వామ్య వ్యాపారాలు, స్నేహితుల నుండి ఆర్థిక సహాయం కోరినట్లయితే, మీ కోరిక నెరవేరుతుంది.
వృశ్చిక రాశి
ఈ సర్వ సిద్ధి యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి విదేశీయానం సిద్ధిస్తుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో అనేక గుర్తింపులు అందుకుంటారు. మీ వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారి ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది. ఎవరికైనా ఆర్థిక సహాయం చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో మీ వల్ల మంచి పని జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications