Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ 4 రాశుల జన్మ ధన్మమైపోయింది..ఈ రోజు నుంచి జీవితంలో మంచి రోజులు స్టార్ట్
ఈ రోజు(డిసెంబర్ 30) సోమవతి అమావాస్య. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం సోమవతి అమావాస్య తేదీ డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై..డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుగుస్తుంది. ఈ రోజున ఉదయం 5.24 గంటల నుండి 6.19 గంటల వరకు స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం. అమావాస్య హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. సోమవతి అమావాస్య శివునికి అంకితం చేయబడినది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తారు.
ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు. కాలసర్ప దోషం,పిత్ర దోషాల నుండి కూడా విముక్తి పొందుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సోమవతి అమావాస్య నాడు ధృవ యోగం,ధృతి యోగం,స్వాతి నక్షత్రం,శివవాసాల ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీని ప్రభావం రాశులపై ఉంటుంది. అయితే సోమవతి అమావాస్య నాలుగు రాశుల వారికి చాలా ప్రత్యేకం కాబోతోంది. ఈ 4 అదృష్ట రాశులు ఏవో ఇక్కడ చూడండి.

4 అదృష్ట రాశులు ఇవే
కన్య
సోమవతి అమావాస్య కన్యారాశి వ్యక్తుల జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకురాగలదు. ఏ పని తలపెట్టినా అదృష్టం మీ వైపు ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి అనేక మార్గాలు తెరుచుకోనున్నాయి. మానసిక రుగ్మతలు తొలగిపోతాయి.
తుల
ఈ రోజు నుండి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తుల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార ప్రయాణాల వల్ల లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహితులకు శుభవార్తలు ఉంటాయి.
వృషభం
సోమవతి అమావాస్య వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరమైనది. ఈ రోజు నుండి జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. డబ్బు సంపాదించడానికి చాలా లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
కుంభం
ఈ రోజు నుండి కెరీర్‌లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులను కలవవచ్చు. వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వివాహితులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి సంబంధిత పనులలో ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. భాగస్వామితో కలిసి రొమాంటిక్ ట్రిప్ కి యాత్రకు వెళ్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications