Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
త్వరలో రాశి మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!
మానవ జీవితంలో శుభాలు, అశుభాలు, మంచి చెడులన్నీ గ్రహాల సంచారం ఆధారంగా నిర్ణయించబడతాయని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు. వాటి ఆధారంగానే మన జీవితంలో జరిగే పరిణామాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే నవగ్రహాల అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 17వ తేదీన కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు.
అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు తులారాశిలో ఉండనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అన్నీ శుభాలే జరగనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు డబ్బు, ఆస్తి, వ్యాపారంలో అనేక లాభార్జన చేస్తారని పలువురు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రాశులు ఏవేవి, ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేరుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు ఏ స్థానంలో ఉంటాడంటే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఈ సమయంలో నీచ స్థానంలో ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రద కాలం గోచరిస్తుంది. అదులో మేష, తులా, కుంభ రాశులు ఉన్నాయి.

మేష రాశి: తులా రాశిలో సూర్య భగవానుడి ప్రవేశం కారణంగా మేష రాశి వారికి చాలా అనువైన కాలం నడుస్తుంది. వీరు చేసే పనిలో సామర్థ్యం పెరుగుతుంది. మీరు చేసే పనిని పూర్తి స్థాయి నిబద్ధతో లాభం వచ్చే విధంగా పూర్తి చేస్తారు. కెరీర్‌లో కొత్త శిఖరాలను చేరుకుంటారు. మేషరాశి వారిలోని నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి.
ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా శాంతి, ఆనందం కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
తులా రాశి: తులారాశిలో సూర్య భగవానుడి ప్రవేశం కారణంగా.. ఇతర రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ.. తులారాశి వారికి మాత్రం, చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. సూర్యుడి సంచారం కారణంగా తులా రాశి వారికి ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో చాలా లాభాలు చేకూరే అవకాశముంది. అయితే ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో ఒత్తిళ్లు ఉండే అవకాశముంది. అందుకే ఓపికతో, సంయమనంతో వ్యవహరించాలి.
కుంభ రాశి: తులారాశిలో సూర్యుడి ప్రవేశం.. ఈ రాశి వారికి శుభప్రదం. ఆర్థికంగా పరిస్థితులు బలంగా ఉంటాయి. ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా కూడా అంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి: ఈ రాశిలో సూర్యుడు.. అయిదవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తి చెందిన వాతావరణంలో మెలుగుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
గమనిక: ఈ కథానాంశంలో పొందుపరిచినా విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు అందించిన సమాచారం ఆధారంగా పొందుపరచబడింది. వీటిని ఆచరించే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications