Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ నెల నుంచే శ్రావణమాసం, ఈ రాశుల వారిని కష్టాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైన మాసం. ఎంతో ప్రత్యేకమైన ఈ మాసంలో పరమశివుడుని కొలిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈసారి శ్రావణ మాసం జులై 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఈ ఏడాది శ్రావణ మాసం రెండు నెలల పాటు ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇలా శ్రావణ మాసం రెండు నెలల పాటు వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సారి వచ్చే శ్రావణ మాసంలో అనే గ్రహాలు, రాశులు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. గ్రహాలు కదలిక రాశులపై తప్పకుండా ఉంటుంది. కొన్ని రాశులకు మంచి జరిగితే, కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి. అలా ఈ శ్రావణమాసంలో కొన్ని రాశుల వారు ఇబ్బందుల పడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం:
జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసం వృషభ రాశి వారికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారు కష్టాలను ఎదుర్కొంటారు. శారీరకంగా, మానసికంగా సమస్యలు వస్తాయి. అనవసర ఖర్చులు ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాయి. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. పెద్ద పెద్ద నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి శివారాధన సహాయం చేస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం కష్టంగా సాగనుంది. పనిభారం పెరుగుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత దూరమవుతుంది. అలాగే దంపతుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. శారీరక శ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై చిన్న పాటి అశ్రద్ధ పెద్దగా మారే ప్రమాదం ఉంటుంది.
కన్యరాశి:
కన్యారాశి వారికి శ్రావణ మాసం ఒడిదొడుకులతో సాగనుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులపై పనిభారం పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పనికి రాని విషయాలపై సమయాన్ని వృథా చేయవద్దు. అనవసర ఖర్చు నివారించాలి. శివారాధన చేయాలి, లింగా జలాభిషేకం శ్రేయస్కరం.
తులారాశి:
ఈ శ్రావణ మాసం తులారాశి వారికి కష్టంగా ఉండనుంది. అనవసర ఖర్చులు నివారించకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులకు సమస్యలు తప్పవు. వ్యాపారులకు నష్టభయంఉంటుంది. శివ నామాలను, మంత్రాలను జపించాలి.
మకర రాశి:
శ్రావణ మాసంలో ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మేలు చేస్తుంది. తొందరబిట డబ్బు పెట్టుబడిగా పెట్టవద్దు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఓపిక ముఖ్యం. ప్రేమను చూపించండి.
కుంభరాశి:
శ్రావణ మాసం కుంభరాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. వ్యాపారంలో భాగస్వామితో విభేదాలు రావొచ్చు. వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. లేకపోతే తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. గాసిప్స్ కు దూరంగా ఉండాలి. శివునికి అభిషేకం శ్రేయస్కరం.
మీనరాశి:
మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదర సంబంధిత రుగ్మతలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులతో సత్సంబంధాలు నెరపాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. రాజీ పడండి, ఓపికగా వదిలి పెట్టవద్దు. ఇతరులను అవమానించవద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications