Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పరివర్తనం చెందిన నక్షత్రాలు.. డిసెంబర్ 27వ తేదీ వరకు ఈ రాశుల వారికి డబ్బే డబ్బు! మీ రాశి కూడా ఉందా?
రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలో శనీశ్వరుడు, శనీశ్వరుడికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచరిస్తున్నారు. దీని కారణంగా అరుదైన నక్షత్ర పరివర్తన చోటు చేసుకోనుంది. దీంతో రాహువు, శని గ్రహాలు పలు రాశుల పోటాపోటీగా శుభ ఫలితాలను ఇవ్వనున్నారు. ఈ నక్షత్ర పరివర్తన కారణంగా ఏ రాశుల వారికి మంచి రోజులున్నాయి? ఏ రాశి వారికి లాభాలు చేకూరనున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం: ఈ రాశిలో లాభ స్థానంలో రాహువు, దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నారు. వీరిద్దరి పరివర్తన కారణంగా ఈ రాశి వారికి చాలా శుభకాలం నడవనుంది. ఉద్యోగులకు ఉద్యోగపరంగా అనేక లాభాలు చేకూరనున్నాయి. ఉద్యోగంలో జీతాలు పెరగడంతో పాటు, పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగి, ఆదాయానికి కొరత లేకుండా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి.

మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో, దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి కూడా ఈ నక్షత్ర పరివర్తన యోగం పట్టుకోనుంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమై తీరుతుంది. తండ్రి సహకారం లభించడంతో పాటు, తండ్రికి సంబంధించిన ఆస్తులు ఏమైనా రావాల్సి ఉంటే అవి కూడా వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి, వివిధ మూలాల నుంచి ఆదాయం దండిగా వస్తుంది.
వృశ్చికం: ఈ రాశి వారికి రాహువు, శనీశ్వరులు నాలుగు, ఐదో స్థానంలో సంచరిస్తున్నారు. వీరిద్దరి పరివర్తన జరగడం వల్ల.. ఈ రాశి జాతకుల ప్రభావం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో వీరికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశించిన దానికంటే ఆదాయం రావడంతో పాటు, సమాజంలో అనుకోని విధంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వీరి ప్రతిభా పాటవాలు బయటపడి నలుగురి ప్రశంసలు అందుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. దీని ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మకరం: ఈ రాశి వారికి ధన, తృతీయ స్థానంలో ఈ రాహువు, శనీశ్వరుడు సంచరిస్తున్నారు. వీరి పరివర్తన కారణంగా ఈ రాశుల వారి జీవితం మలుపు తిరగనుంది. వీరు చేపట్టే అన్ని ఆదాయ కార్యక్రమాలన్నీ విజయవంతమై తీరుతుంది. ఆదాయ, వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం ఖరారవుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశి వారికి అధిపతి శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్న రాహువు పరివర్తన చెందడం వల్ల.. ఈ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం సమకూరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అనుకోని విధంగా డబ్బులు వచ్చి పడతాయి. ఉద్యోగంలో భారీగా వేతనాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆర్ధిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications