Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
శుక్ర సంచారం.. డిసెంబర్‌లో ఈ 3 రాశుల వారి చేతినిండా డబ్బులే ఉంటాయి!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రుడు సంపద, కీర్తి, ఐశ్వర్యం మొదలైన వాటిని సిద్ధిస్తాడు. కొన్ని అరుదైన సందర్భాల్లో ఒకే నెలలో గ్రహాలు రెండుసార్లు సంచరిస్తాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిలోనూ కనిపిస్తుంది. అలాంటి శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో రెండుసార్లు సంచరించనున్నాడు. మకర, కుంభ రాశుల్లో శుక్రుడు సంచరించనున్నాడు. పదిహేను రోజుల వ్యవధిలో ఈ రెండు రాశుల్లో శుక్ర సంచారం జరగనుంది.
దీని కారణంగా మూడు రాశుల వారికి డిసెంబర్‌లో అదృష్టం కలిసిరానుంది. ప్రేమ విజయవంతమవడంతో పాటు సంపదకు కారణమవుతాయి. అలాగే అనుకున్న కార్యాలన్నీ విజవంతమవుతాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవడంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి అదృష్టం పట్టుకోనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు డిసెంబర్‌లో శుక్రుని సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశివారు తమ అదృష్టాన్ని బలపరుచుకోనున్నారు. నిరుద్యోగులకు ఈ నెలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వ్యక్తులకు ఉద్యోగం రావడం, వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యక్తులకు అనుకున్న విధంగా కలిసి రావడం జరుగుతుంది. కొత్త ఒప్పందాలు మీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి.
సింహ రాశి
డిసెంబర్ నెలలో శుక్రుని సంచారం వల్ల సింహరాశి వారు చాలా లాభాలను పొందుతారు. అవివాహితులకు మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి అవుతుంది. శుక్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీని కారణంగా ఈ రాశి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. కుటుంబంలోని అనేక సమస్యలు తొలిపోతాయి. దంపతుల మధ్య సామరస్యం కుదురుతుంది. మీరు ఊహించని విధంగా ధన ప్రభావం వస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రుణాలు, లాభదాయకమైన పెట్టుబడులు మీ ఆదాయాన్ని పెంచుతాయి. మీరు ఉద్యోగి అయితే, మీరు మీ కార్యాలయంలో మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీ బాధ్యతను పెంచుకుంటారు.
కుంభ రాశి
డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశి చెందిన వ్యక్తుల జీవితం స్థిరమైన పురోగతిని సాధిస్తుంది. ఎందుకంటే శుక్రుడు సంచరించిన రెండుసార్లు ధన, లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కుంభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ కాలంలో చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి ముడుతుంది.
కుంభరాశికి చెందిన వ్యక్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా?, పెట్టుబడులు పెట్టాలన్నా ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో మీ మనోహరమైన సంభాషణ కారణంగా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అది లాభదాయకంగా మారడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు డబ్బు లేని లోటు ఉండదు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, జోతిష్యం, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. దీనిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications