Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
రాసిపెట్టుకోండి.. డిసెంబర్ నెలలో ఈ 4 రాశుల వారి కోటీశ్వరులు అవుతారు!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటాయి. అలాగే ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా గ్రహాలు ప్రవేశించే రాశితో పాటు మిగిలిన రాశులు కూడా ప్రభావితం అవుతాయి. కొన్ని రాశుల వారికి ఈ గ్రహాల సంచారం వల్ల ప్రయోజనాలు జరిగితే, మరికొన్ని రాశుల వారికి చెడు సంకేతాలు వస్తుంటాయి.
అయితే ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్‌లో ఐశ్వర్యం, సుఖ సంతోషాలను ఇచ్చే శుక్రుడు రాశి మార్పు చెందనున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు తన రాశిని శుక్రుడు మార్చుకోనున్నాడు. ఒకసారి మకర రాశిలో ప్రవేశిస్తే, ఇంకోసారి కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై సంపద వర్షం కురుస్తుంది. ఇంతకీ ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర సంచారం ఎప్పుడంటే?
వేద క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు తన రాశిని మార్చుకోనున్నాడు. డిసెంబర్ 2వ తేదీన శుక్రుడు మొదటిసారి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సుమారు 26 రోజుల పాటు అదే రాశిలో కొనసాగుతూ.. డిసెంబర్ 28వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి తన గమనాన్ని కొనసాగిస్తాడు. దీని కారణంగా నాలుగు రాశుల వారిపై సంపద వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఇవే..
వృషభ రాశి:
డిసెంబర్ నెలలో రెండు సార్లు శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశుల వారికి శుభపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు భారీగా ఆదాయాన్ని పొందుతారు. ఆర్ధిక పరిస్థితి బలంగా మారుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న స్థాయిలో లాభాలను పొందుతారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం నెలకొంటుంది.
తులా రాశి:
డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుని సంచారం వల్ల.. తులారాశి జీవితాలపై సానుకూల ప్రభావం ఉండనుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించనుంది. వ్యాపారంలో డబ్బులు సంపాదించేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.
మకర రాశి:
ఈ రాశిలోనే డిసెంబర్ నెలలో శుక్రుడు తన సంచారాన్ని మొదలుపెట్టనున్నాడు. శుక్రుడిని అత్యంత ప్రీతిపాత్రమైన గ్రహంగా చెప్పుకుంటారు. దీని కారణంగా మకర రాశి వారికి సిరి సంపదలు కురవనున్నాయి. చేపట్టిన పనులన్నీటినీ పూర్తి చేసి భారీగా లాభాలను పొందుతారు. డిసెంబర్ నెలలో మకర రాశి జాతకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
కుంభ రాశి:
డిసెంబర్ నెలలో రెండోసారి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సిరి సంపదలకు నెలవైన శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బులు పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంగా సంతోషమయంగా మారుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు జోతిష్య శాస్త్రం, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు లేదా అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications