Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జోతిష్యంలోనే అరుదైన ఘట్టం.. కలిసిపోనున్న శని, సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి 100 ఏళ్ల అదృష్టం!
జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తమ రాశిని, గమనాన్ని మార్చుకుంటాయి. ఇలా రాశిని, గమనాన్ని మార్చుకున్నప్పుడు దాని ప్రభావం ఇతర రాశుల వారిపై కూడా కనిపిస్తుంది. ఇది కొందరికి మంచి, ఇంకొందరికి చెడు ఫలితాలను అందించనుంది. అయితే 2025 ప్రారంభంలో నవ గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడితో నవ గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడు కలుస్తున్నారు.
సూర్యుడు, శనీశ్వరుడు తండ్రి కొడుకులైనప్పటికీ శత్రువులుగా పరిగణించబడతారు. శత్రువులైన ఇద్దరూ కలవడం వల్ల కొందరికి మంచి ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకంగా కింద పేర్కొనబడిన మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం పట్టుకోనుంది. ఈ రాశుల వారికి ఆదాయం పెరగనుంది. సమాజంలో గుర్తింపుతో పాటు చేతి నిండా డబ్బులు, కుటుంబంలో సంతోషంతో ఈ రాశుల వారి మంచి రోజులను గడపనున్నారు. ఆ రాశులు ఏవంటే?

సింహ రాశి
ఈ రాశి వారికి 7వ స్థానంలో ఈ సూర్య, శని సంయోగం జరుగుతుంది. దీని వల్ల ఈ రాశి వారి అతిపెద్ద జాక్‌పాట్ కొట్టబోతున్నారు. ప్రతి రంగంలో ఈ రాశి వారు విజయం సాధించబోతున్నారు. సూర్యుడి అనుగ్రహం వల్ల సమాజంలో గౌరవం, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం రెండూ పెరగనున్నాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. సాధించాలన్న ప్రతీదానిని సాధిస్తారు.
వ్యాపారులు భారీగా లాభాలు పొందుతారు. చేపట్టే ప్రయాణాలు ఆర్ధిక లాభాలను తీసుకొస్తాయి. ప్రేమ, వైవాహిక, కుటుంబ జీవితాలు అద్భుతంగా కొనసాగుతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి.
వృశ్చిక రాశి
ఈ వృశ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో శని, సూర్యుల సంయోగం జరుగుతుంది. దీని కారణంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆస్తి, ఇల్లు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఈ కాలంలో అద్భుతమైన రోజులను గడుపుతారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడంతో పాటు ప్రమోషన్స్ లభిస్తాయి. స్నేహితుల నుంచి ప్రతిఒక్కరికీ మద్దతు లభిస్తుంది. ఆర్ధిక మార్గాలు పెరగడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు.
సమాజంలో ఈ రాశి వారికి హోదా, గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగుతుంది. ఏ విధంగా చూసుకున్న ఈ రాశి వారికి మంచి రోజులు ఉండబోతున్నాయి.
వృషభ రాశి
ఈ రాశి వారికి పదో స్థానంలో సూర్య,శని సంయోగం కలుగుతోంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఊహించని విధమైన ఫలితాలను పొందుతారు. భారీగా లాభాలను పొందడంతో పాటు అనుకోని స్థాయిలో డబ్బులను సంపాదిస్తారు. చేతినిండా డబ్బులతో మెరిసిపోతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోలు తమ పని తీరుతో ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు.
ఈ కాలంలో ఈ రాశి వారికి ఉన్న చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఆస్తి, గృహ, వాహన కొనుగుళ్ళు చేపడతారు. డబ్బును ఆదా చేసుకోవడానికి పెద్దపీట వేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వైవాహిక జీవిత బాగుండబోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications