Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ధనిష్ఠ నక్షత్రంలోకి సూర్యుడు..ఈ 3 రాశులకు గండం!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో మార్పులు మనుషుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. 2026 ఫిబ్రవరి6న కీలకమైన గ్రహ సంచారం జరుగుతుంది. గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు..కుజుడు ఆధిపత్యం వహించే ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 19,2026 వరకు సూర్యుడు దనిష్ఠ నక్షత్రంలోనే సంచరిస్తాడు.
సూర్యుడు అంటేనే తేజస్సు, వేడికి ప్రతీక. ఇక కుజుడు ఉగ్ర స్వభావానికి కారకుడు. సూర్యుడు.. కుజుడి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అగ్ని తత్వం పెరుగుతుంది. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్, కుటుంబం, ఆరోగ్య విషయాలలో ఈ రాశుల వారు గట్టి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ రాశులు ఏవి? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇక్కడ చూడండి.

మిథున రాశి
ఉద్యోగ జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. మీ పై అధికారులు మీ పనిలో చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దంలో పెట్టి చూసే ప్రమాదం ఉంది.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మరికొన్నాళ్లు ఓపిక పట్టాలి. కుటుంబంలోని ఒక సభ్యుని ఆకస్మిక అనారోగ్యం మీకు మానసిక ఆందోళన కలిగించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
పరిహారం: ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యుడికి సంబంధించిన మంత్రాలను (ఓం సూర్యాయ నమః) జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడే అయినప్పటికీ ఈ సంచారం వల్ల పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన బిజీ వల్ల కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు.
తండ్రితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గుప్త శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: రోజూ ఉదయం సూర్యుడికి నీటిని (అర్ఘ్యం) సమర్పించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
కుంభ రాశి
భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు జరిగే అవకాశం ఉంది. చిన్న పొరపాటు కూడా ఉద్యోగానికి ముప్పు తేవచ్చు. తోబుట్టువులతో వాదనలు జరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సమన్వయ లోపం వల్ల మానసిక ప్రశాంతత లోపించవచ్చు.
పరిహారం: ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కోసం, దోష నివారణ కోసం శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications