సూర్యుని నక్షత్ర మార్పు..మే 25 నుండి జూన్ 8 వరకు వీరికి రాజయోగం,మీది ఉందేమో చూసుకోండి

ఖగోళంలో గ్రహాల సంచారాలు మన జీవితాలపై అపారమైన ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ప్రతి గ్రహం తనదైన రీతిలో, నిర్దిష్ట సమయాల్లో రాశిచక్రాలను, నక్షత్రాలను మారుతూ ఉంటుంది. ఈ మార్పులు కొందరికి శుభాలను, మరికొందరికి మిశ్రమ ఫలితాలను, ఇంకొందరికి కొంత ప్రతికూలతను సూచిస్తాయి. గ్రహాల రాజు అయిన సూర్యుడు మే 25న ఆదివారం వృషభరాశిలోని రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ప్రవేశంతోనే రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ కాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర పరంగా ఈ సంచారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలో మే 25, 2025 నుండి జూన్ 8, 2025 వరకు సంచరిస్తాడు.

రోహిణి నక్షత్రానికి అధిపతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కాగా నక్షత్రాధిపతి శుక్రుడు. శుక్రుడు సౌందర్యానికి, సుఖసంతోషాలకు, భోగభాగ్యాలకు ప్రతీక. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, అధికారానికి, తేజస్సుకు కారకుడు. ఇలాంటి విశిష్ట కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను ప్రసాదించనుంది. మే 26న శని జయంతి పర్వదినం ముందే సూర్యుని ఈ నక్షత్ర మార్పు జరగడం విశేషం. సూర్యుని రోహిణి నక్షత్ర సంచారం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కష్టాలు తొలగిపోయి, అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో ఇక్కడ చూడండి.

Sun Enters Rohini Nakshatra Fortune Favors These 4 Signs

వృషభ రాశి
రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచార ప్రభావం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఈ కాలంలో మీకు ఆర్థికంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి పదోన్నతులు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ మీ అత్తమామలతో ఏవైనా మనస్పర్థలు లేదా సమస్యలు ఉంటే, సూర్యభగవానుడి కృప వలన ఆ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల నుండి, బంధుమిత్రుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. సూర్యునిప్రకాశవంతమైన కిరణాల మాదిరి మీ వ్యక్తిగత తేజస్సు కూడా ఇనుమడిస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, స్థిరత్వం చేకూరుతుంది. నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది.

సింహ రాశి
సింహ రాశికి అధిపతి స్వయంగా సూర్యభగవానుడే. తన సొంత అధిపతి రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల సింహ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన యోగకాలం. మీలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆత్మగౌరవం అమాంతం పెరుగుతాయి. సూర్యుని అనుగ్రహం వల్ల ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో నూతన శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. ప్రమోషన్లు, ఉన్నత పదవులు, లేదా సమాజంలో ప్రత్యేక గౌరవం పొందే సూచనలున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌ లో ఉన్న పనులు, ముఖ్యంగా ప్రభుత్వం లేదా పరిపాలనకు సంబంధించినవి విజయవంతంగా పూర్తవుతాయి. దీని వలన ప్రజా జీవితంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. మీ మాట నెగ్గుతుంది.

వృశ్చిక రాశి
రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి కూడా అనేక శుభాలను తీసుకురానుంది. ముఖ్యంగా మీ సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మీ తండ్రితో మీ సంబంధాలు మరింత బలపడతాయి, ఆయన నుండి మీకు సహాయసహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా ఇది చాలా మంచి సమయం. సూర్యుని తేజస్సు కారణంగా మీరు శారీరకంగా, మానసికంగా చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో తమ నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ సునాయాసంగా సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి, సహోద్యోగుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన, అన్యోన్యత బలపడతాయి. ఏవైనా పనులు అసంపూర్ణంగా ఉంటే సూర్యుని నక్షత్ర మార్పు శుభ ప్రభావాల కారణంగా అవి త్వరగా పూర్తయి మీకు సంతృప్తిని కలిగిస్తాయి.

కుంభ రాశి
రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం కుంభ రాశి వారి మనస్సాక్షి, దాతృత్వ గుణం, విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ కాలం మీ మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అనుకూలమైనది. ధ్యానం, యోగా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. మీ పాత సమస్యలు, చింతలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం, వ్యాపారం, లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తుంటే సూర్యభగవానుడి దయతో మీ కోరిక నెరవేరే బలమైన అవకాశాలున్నాయి. సూర్యుని సంచార ప్రభావంతో, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలున్నాయి. ఒకవేళ ఏదైనా బంధువుతో మీ సంబంధం దెబ్బతిని ఉంటే అది కూడా మెరుగుపడి, తిరిగి సఖ్యత నెలకొనే అవకాశం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, May 25, 2025, 11:18 [IST]
Desktop Bottom Promotion