Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అశ్విని నక్షత్రంలోకి అడుగుపెడుతున్న సూర్యుడు..3 రాశుల పంట పండినట్లే!
చాలా సంస్కృతుల్లో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో కూడా సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని తేజోమయుడిగా,గ్రహాలన్నింటికి అధిపతి అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. సూర్యుడి కదలికలు భూమిపైనే కాకుండా మన జీవితాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. దాదాపు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే సూర్యుడు కొన్నిసార్లు నక్షత్రాలను కూడా మారుస్తుంటాడు. ఇలా సూర్యుడి స్థానంలో వచ్చే ప్రతి మార్పు అన్ని రాశుల జీవితాల్లో ఏదో ఒక రకమైన ప్రభావాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఖగోళంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏప్రిల్ 14,2025న చోటు చేసుకోబోతుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న సూర్య భగవానుడు ఏప్రిల్ 14న మేషరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. విశేషమేమిటంటే అదే రోజున సూర్యుడు అశ్విని నక్షత్రంలోకి కూడా ప్రవేశించనున్నాడు. ఒకే రోజున రాశిని,నక్షత్రాన్ని మార్చడం అనేది చాలా ముఖ్యమైన ఖగోళ సంఘటనగా జ్యోతిష్య పండితులు భావిస్తున్నారు. సూర్యుడి ఈ ప్రత్యేకమైన నక్షత్ర మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ఎఫెక్ట్ చూపుతుంది. కొందరు ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండగా..మరికొన్ని రాశుల వారికి మాత్రం ఈ సంచారం అదృష్టం తెచ్చిపెట్టనుందని జ్యోతిష్య పండితులు తెలిపారు.

అశ్విని నక్షత్రం జ్యోతిష్యశాస్త్రంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. 27 నక్షత్రాలలో మొదటిదైన అశ్విని నక్షత్రం..శక్తి, ప్రారంభం, వైద్యం, వేగవంతమైన చర్యతో సంబంధం కలిగి ఉంటుంది. కేతువు అధిపతిగా ఉండే అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. సూర్యుడు ఏప్రిల్ 14న అశ్విని నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇక్కడ చూడండి.
మిథున రాశి
అశ్విని నక్షత్రంలోకి సూర్యుని ప్రవేశం మిథునరాశి వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలను తీసుకొస్తుంది. మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులన్నీ ఈ సమయంలో విజయంవంతంగా పూర్తయిపోతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకువాళ్లకు ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే..గతంలో కన్నా చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తండ్రి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది.
వృశ్చిక రాశి
సూర్య భగవానుడి సంచారం వృశ్చిక రాశి వ్యక్తులకు మంచి శుభవార్తలను తీసుకొస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉండటంతో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది,జీతం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏ పోటీలో అయినా విజయం మీదే అవుతుంది. చాలా కాలంలో ఏదైనా విషయంలో కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ టైంలో కోర్టు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి.
సింహ రాశి
సూర్య భగవానుడి సంచారం కారణంగా సింహ రాశి వ్యక్తులకు కుటుంబంలో,ఆఫీసులో చాలా మిమ్నల్ని ఇబ్బందిపెడుతున్న సమస్యలన్నీ ముగిసిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. జీవితాల్లో ఓ పెద్ద పాజిటివ్ మార్పు ఉంటుంది. అదృష్టం మీకు పూర్తిగా అండగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో మీ అద్భుతమైన పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఇంతకముందు నుంచి ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఆరోగ్యం మెరుగవుతుంది. కొంతవరకు ఆరోగ్యపరంగా ఇబ్బంది తగ్గిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications