Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
రాజయోగం అంటే ఇదే..ఫిబ్రవరిలో ఒకే రాశిలో 4 గ్రహాలు..ఈ 3 రాశుల దశ తిరగబోతోంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, వాటి కలయికలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎప్పుడైతే ఒకే రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కలుస్తాయో, అప్పుడు కొన్ని విశేషమైన యోగాలు ఏర్పడతాయి. అటువంటి అత్యంత శక్తివంతమైన,అరుదైన యోగమే చతుర్గ్రహి రాజయోగం.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కుంభరాశి వేదికగా ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. ఈ పరిణామం కొన్ని రాశుల వారికి అఖండ ఐశ్వర్యాన్ని, విజయాలను అందించబోతోంది.

అసలేంటి ఈ చతుర్గ్రహి యోగం?
-ఫిబ్రవరి 3న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
-ఫిబ్రవరి 13న గ్రహాల రారాజు సూర్యుడు కుంభంలోకి అడుగుపెడతాడు.
-ఫిబ్రవరి 23న కుజుడు కూడా ఇదే రాశిలో చేరతాడు.
-రాహువు ఇప్పటికే కుంభరాశిలో సంచరిస్తున్నాడు.
ఇలా సూర్యుడు, బుధుడు, కుజుడు, రాహువు.. ఈ నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలవడాన్ని చతుర్గ్రహి యోగం అంటారు. జ్యోతిషశాస్త్ర రీత్యా ఇది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగ ప్రభావంతో ఫిబ్రవరిలో మూడు రాశుల వారి తలరాతలు మారబోతున్నాయి.
మిథున రాశి
ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ప్రమోషన్లు లేదా శాలరీ హైక్ లు వంటి గుడ్ న్యూస్ లు వింటారు. వ్యాపారస్తులు ఊహించని విధంగా లాభాలు గడిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడిని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఎంతో మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులకు కూడా ఇది సరైన సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు, కోర్టు కేసులు లేదా ఇతర సమస్యలు ఇప్పుడు త్వరత్వరగా పరిష్కారమవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు భారీ డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది, దీనివల్ల గణనీయమైన ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభ రాశి
ఈ అరుదైన యోగం ఏర్పడుతున్నది కుంభ రాశిలోనే కాబట్టి దీని సానుకూల ప్రభావం మీపైనే ఎక్కువగా ఉంటుంది. నాలుగు గ్రహాలు మీ లగ్నంలో ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి మంచి ర్యాంకులు సాధిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
