Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఏడాది తర్వాత పవర్ ఫుల్ రాజయోగం..3 రాశులు నక్కతోక తొక్కబోతున్నారు
మన జీవితాల్లో జరిగే అన్ని రకాల మార్పులకు నవ గ్రహాల గమనమే కారణమని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి. వీటినే రాజయోగాలు అంటారు. వీటి ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తుంది. గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు.. ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఆ విధంగా ఏప్రిల్ 14,2025న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
సూర్యుడు మేష రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా బుధుడు కూడా మే నెలలో మేష రాశిలోకి వస్తాడు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. మేష రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగంను సృష్టిస్తారు. ఈ శక్తివంతమైన రాజయోగం కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలను తెస్తుంది. వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ అద్భుతమైన పురోగతి ఉంటుంది. మేష రాశిలో ఏర్పడే ఈ బుధాదిత్య రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి
మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం వారి జాతకంలోని 11వ ఇంట్లో ఏర్పడబోతోంది. దీని ఫలితంగామిథున రాశి వ్యక్తులు వారు తమ ఆదాయంలో అనూహ్యమైన పెరుగుదలను చూస్తారు. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. సూర్యుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఆఫీసులో కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది. మీ సంపద వృద్ధి చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారి జాతకంలోని 9వ ఇంట్లో సూర్యుడు, బుధుడు కలవడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కొందరికి విదేశాలకు వెళ్లే అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి.
మీన రాశి
మీన రాశి వారి జాతకంలోని 2వ ఇంట్లో బుధుడు, సూర్యుడు కలవడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీనరాశి వ్యక్తులు ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఇది సమాజంలో మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీ పై అధికారులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. దీనివల్ల మీరు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారం చేసే వారికి ఎక్కడో ఆగిపోయిన లేదా నలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
