Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
శని నక్షత్రంలో సూర్యుడి ప్రవేశం..ఈ 5 రాశుల వాళ్లకి భారీగా డబ్బు,ప్రత్యర్థులపై విజయం
సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఇది అన్ని రాశుల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్యుని రాశిలో మార్పు ఏదైనా రాశిని ప్రభావితం చేసినప్పుడు అది ఆ రాశికి చెందిన వ్యక్తి గౌరవం,ఆర్థిక,శారీరక,మానసిక,వృత్తి, వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. సూర్యుడు నేటి నుండి అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. అనూరాధ నక్షత్రం ఆకాశంలోని మొత్తం 27 రాశులలో 17వ రాశి, దాని అధిపతి శనిదేవునిగా పరిగణించబడుతుంది.
సూర్యుడు శని నక్షత్రం అంటే అనూరాధ నక్షత్రంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే కన్యారాశి సహా కొన్ని రాశుల వాళ్లు మాత్రం ఆర్థికంగా భారీ ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలను పొందుతారు. సూర్యుని రాశి మార్పు వల్ల ఏయే రాశులకు అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు చూద్దాం.

మేష రాశిపై సూర్యుని రాశి మార్పు ప్రభావం
ఈ సూర్యుని సంచారము కొత్తగా పెళ్లయిన వారికి పిల్లలు పుట్టే అవకాశాలను సృష్టిస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు శ్రేయస్సును తెస్తుంది. పదవులు, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కృషి, అంకితభావంతో విజయం సాధించగలరు. కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు, ప్రయాణ అవకాశాలు ఉంటాయి.
మిథున రాశి
ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కోసం ఏ ప్రణాళిక వేసినా అది విజయవంతమవుతుంది. ఉద్యోగం లేదా విదేశాల్లో చదువుకోవాలనే కల నెరవేరుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి
సూర్యుని ఈ సంచారము క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీకు విజయాన్ని అందించబోతోంది. మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే దాని గురించి ఎవరికీ చెప్పకండి. గోప్యంగా పని చేస్తే విజయం సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబం నుండి ఫుల్ సపోర్ట్ పొందుతారు. అంతేకాదు ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో ఏదైనా పెట్టుబడి పెడితే అందులో మీకు మంచి లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీ ఆదాయం బాగుంటుంది. కార్యాలయంలో కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు.
మీన రాశి
సూర్యుని ప్రభావం కారణంగా మనస్సు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది. పూజలు,శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. మీ నిర్ణయాలు ప్రశంసించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. సూర్యుని సంచార సమయంలో మీన రాశికి చెందిన విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించాలనుకుంటే వారి ప్రణాళికలలో విజయం సాధించవచ్చు.
note: మత విశ్వాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
