Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
భాద్రపద నక్షత్రంలో సూర్యుడు.. అందరూ వేచి చూస్తున్న శుభ దినం వచ్చేసింది!
మన జన్మ నక్షత్రం మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ డిసెంబర్‌లో సూర్యుడు భాద్రపద నక్షత్రంలో సంచరించనున్నాడు. దీని కారణంగా అనేక రాశిలలో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవగ్రహాలు రాశులను మార్చుకోవడం మాత్రమే కాదు నక్షత్రాలు కూడా తమ తమ రాశులను మార్చుకుంటాయి. దీని కారణంగా కొన్ని ఫలితాలు పలు రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి.
భాద్రపద నక్షత్రానికి అధిపతి శుక్రుడు, సూర్యుడు ఒకే సమయంలో ఆ నక్షత్రంలో సంచరిస్తున్నారు. దీని కారణంగా అనేక యోగాలు ఏర్పడనున్నాయి. ఆ యోగాలు పలు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇంతకీ భాద్రపద నక్షత్రంలో సూర్యుడి సంచారం వలన ఏ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేష రాశి
భాద్రపద నక్షత్రంలో సూర్యడి సంచారం వల్ల మేష రాశి వారికి చాలా కాలంగా పూర్తవకుండా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఈ రాశుల వారు సుదూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఇది మీకు ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అద్భుతమైన రోజులను గడుపుతారు. భారీగా లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చేసే వారికి మంచి రోజులు రానున్నాయి. మీ కుటుంబంలో నెలకొన్న చాలా టెన్షన్‌లు తొలగిపోతాయి. తద్వారా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అవివాహితులకు మంచి రోజులు రానున్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి భాద్రపద నక్షత్రంలో సూర్యుడు సంచరించడం వల్ల అనేక విజయాలు లభిస్తాయి. కారు కొనాలనే వారి కల నెరవేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైన మద్దతుతో మీరు మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలసి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది.
వృశ్చిక రాశి
భాద్రపద నక్షత్రంలో సూర్యుని సంచారము వృశ్చికరాశి వారికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. వ్యాపార సంబంధిత లాభాలు పెరుగుతాయి. చాలా రోజులగా అలానే ఉండిపోయిన డిమాండ్ మరియు కల నెరవేరుతుంది. పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయట పడతారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప పని చేయబోతున్నారు. ఇంట్లో మంచి పని జరుగుతుందనే సూచనలు కనిపిస్తుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications