Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
sun in dhanu rasi: ధనస్సు రాశిలోకి సూర్యుడు..5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
గ్రహాల రాజు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. డిసెంబర్ 15 ఆదివారం రాత్రి 10:19 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడు. 2025 జనవరి 14వరకు ధనస్సు రాశిలోనే ఉంటాడు. అయితే ధనస్సు రాశిలోకి సూర్యుడు రాగానే 5 రాశుల వారికి అదృష్టం పడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి శుభం కలుగుతుందో ఇఫ్పుడు చూద్దాం.
ధనస్సు రాశిలో సూర్య సంచారంతో లాభపడే రాశులు ఇవే
కర్కాటకం
సూర్య సంచారం ర్కాటక రాశి శుభ ఫలితాలను తెస్తుంది. చర్చ, కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు ఏ పని చేయాలనుకున్నా సమయం అనుకూలంగా ఉంటుంది..అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలలో లాభం ఉంటుంది. పెట్టుబడి లేదా ఇతర పనుల కోసం డబ్బు పొందడం సులభం అవుతుంది.

సింహం
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ధనుస్సు రాశిలో సూర్యుని సంచారంతో ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఇటీవల వివాహం చేసుకున్న వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు.
తుల
సూర్యుని రాశిలో మార్పు తులారాశి వారికి శుభాన్ని తెలస్తుంది. డిసెంబర్ 15 నుండి మీ అదృష్టం బలపడుతుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు కానీ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విజయం సాధిస్తారు వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కెరీర్ పురోగతి కోసం కొత్త అవకాశాలను పొందుతారు.
ధనుస్సు
విద్యా పోటీలతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. విజయం పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మద్దతు లభిస్తుంది. మీ బాస్ ప్రవర్తన కూడా మీ పట్ల సాఫ్ట్ గా మారవచ్చు. ఇది మీ కెరీర్‌లో పురోగతికి అవకాశం ఇస్తుంది. మీ పని ప్రశంసించబడవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
కుంభం
ఆర్థిక పరిస్థితిలో వేగవంతమైన మెరుగుదల చూడవచ్చు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. సూర్యుని ఆశీర్వాదంతో పెద్ద ఒప్పందం లేదా ప్రభుత్వ పనిని పొందుతారు. వైవాహిక జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications