Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రాశుల వారిపై ఆగ్రహించిన సూర్యుడు.. జాగ్రత్తగా ఉండకపోతే సూర్యుడి వేడికి కాలిపోతారు!
నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. అలాంటి సూర్యుడు ప్రతినెలా ఒకసారి తన రాశిని మార్చుకుంటారు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు.. ఈనెల 15వ తేదీన తన రాశిని మార్చుకోనున్నాడు. డిసెంబర్ 15వ తేదీన వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా పలు రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకోబుతున్నాయి. మరీ ముఖ్యంగా పలు రాశుల వారికి ఆరోగ్య సమస్యలు కలగనున్నాయి. ఆ రాశులు ఏంటో అవి తెలుసుకుందాం.
వృషభ రాశి
సూర్యుడు సంచారం వల్ల ఈ రాశి వారికి ఈరోజు భారీగా నష్టాలు చేకూరే అవకాశం ఉంది. ధనుస్సు రాశిలోకి సూర్యుసు సంచారం వల్ల ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు నిండిపోయి, విడిపోయే ప్రమాదం ఉంటుంది. నెల రోజుల వారు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ మాటలను అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. సమాజంలో గౌరవ భంగం కలిగే ఛాన్సుంది.

కర్కాటక రాశి
సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల ఈ రాశి వారికి కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. అనేక బాధలు పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు.
కన్య రాశి
సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల కన్య రాశికి చెందిన వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందిగా మారుతాయి. మరీ ముఖ్యంగా ఉదార సంబంధిత సమస్యలతో ఈ రాశికి చెందిన వ్యక్తులు తీవ్రంగా బాధపడతారు. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారు. దీని కారణంగా మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే తెలివిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసుకు ప్రశాంతంగా ఉండాలంటే జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి.
మకర రాశి
సూర్యుడు తన రాశిని మార్చుకొని ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారు. మానసికంగా ఒత్తిడిలో కూరుకుపోతారు. కుటుంబ సభ్యులతో పలు వివాదాలు ఏర్పడతాయి. ఈ వివాదాలకు దూరంగా ఉండాలి లేకపోతే సమస్యలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
కుంభ రాశి:
సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఏర్పడనుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో కార్యాలయంలో గౌరవం తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రతగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications