Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Sun transit in scorpio: వృశ్చిక రాశిలోకి సూర్యుడు..ఈ 4 రాశుల వారికి అన్నీ కష్టాలే!
గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉన్న వ్యక్తికి ఉన్నత స్థానం, కీర్తి, అపారమైన సంపద,మంచి ఆరోగ్యం లభిస్తాయి. అయితే సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి అనేక రకాల ఇబ్బందులు, బాధలను అనుభవిస్తాడు. శనివారం(నవంబర్ 16) ఉదయం తుల రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించి.. డిసెంబర్ 15,2014 వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు.
శనివారం ఉదయం 7:41 గంటలకు సూర్యుడు.. శుక్రుని ప్రభావంతో తులారాశి నుండి బయటకు వచ్చి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. అయితే నాలుగు రాశుల వాళ్లు మాత్రం ఈ సంచార ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇబ్బందులు ఎదుర్కోబోయే రాశులు ఏవి,సూర్య సంచారం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం
వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఈ సమయంలో,ః మీరు అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. కడుపు, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగ కెరీర్ లో కూడా హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు పనిపై ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత మంచిది. రాజకీయాలకు దూరంగా ఉండాలి.
మిధునం
శత్రువు వైపు నుండి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు ఆఫీసులో లేదా పని ప్రదేశంలో మీ వర్క్ ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ చంచల స్వభావం సమాజంలో మీ ప్రతిష్టపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తక్కువ మాట్లాడండి, ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మిథున రాశి వ్యక్తులు డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వసనీయ వ్యక్తితో మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరపాలి.
సింహం
సింహ రాశి వారికి కోపం ఎక్కువ కావడం వల్ల తమ పనిని పాడు చేసుకుంటారు. మీ ప్రవర్తనలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి. ఈ రాశి వారికి కెరీర్ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. పని పట్ల ఆసక్తి ఉండదు, ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగాలు మారాలని కూడా ఆలోచించవచ్చు. గొంతు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.
ధనుస్సు
ధనుస్సు రాశి వాళ్లు ఆర్థిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవాంఛనీయ ఖర్చులు ఈ నెల బడ్జెట్‌ను పాడు చేస్తాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి..లేకుంటే మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు కూడా సమయం మంచిగా ఉండదు కాబట్టి ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా ముందుకు వేయాలి. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ కాలంలో ఆధ్యాత్మిక రంగంలో పురోగతిని పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications