Latest Updates
-
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!
విశ్వానికే అధిపతి సూర్యుడు. జ్యోతిష్యం ప్రకారం ఆ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, సూర్యుడు ప్రవేశించే రాశి చక్రాలు.. మన జీవితంలో పరిస్థితులను నిర్ధారిస్తాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 17న ఉదయం 7.47 గంటలకు సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 వరకు అక్కడే ఉంటాడు. ఈ క్రమంలో కన్యా రాశికి అధిపతిగా బుధుడు ఉండగా.. ఈ రెండిటి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంది. అయితే జాతకంలోని గ్రహ స్థానాల ప్రభావంతో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి సవాల్ కానుంది. పలు అంశాల్లో తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఆ రాశులేంటి.. పరిణామాలేంటి.. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. తెలుసుకుందాం..

మకర రాశి..
కన్యా రాశిలోకి సూర్య సంచారం మకర రాశి వారికి కొన్ని ఛాలెంజెస్ తీసుకురానుంది. ఈ రాశి వారికి సూర్యుడు ఎనిమిదో స్థానానికి అధిపతి. అయితే తొమ్మిదో స్థానంలోకి ప్రవేశిస్తుండటంతో వీరి జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీరు ఏదైనా పని చేపట్టినప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో వేగం తగ్గిపోవచ్చు. పనులు మందకొడిగా సాగుతాయి. పని పూర్తి చేయాలంటే గతం కంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబీకులతో వాదనలు తలెత్తే అవకాశం ఉంది. మీకు ఇప్పటికే పనులు వాయిదా వేసే అలవాటు ఉంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే ముఖ్యమైన పనులు వీలైనంతగా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది.

కుంభరాశి

జ్యోతిష్యం ప్రకారం కుంభ రాశి వారికి సూర్యుడు ఏడవ స్థానంలో అధిపతిగా ఉన్నాడు. అయితే ఇప్పుుడ ఎనిమిదో స్థానంలోకి వెళ్లడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తొందరపాటుతనంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు వివిధ సమస్యలకి దారితీస్తాయి. మీ జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురుకావచ్చు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.

మీన రాశి
మీన రాశి వారికి సూర్యుడు ఆరో స్థానానికి అధిపతి కాగా.. కన్యారాశిలోకి సంచారంతో ఏడో స్థానంలో సూర్యుడి ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి వారు జీవితంలోని కీలక రంగాల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఏదైనా పని పూర్తి చేయాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. వ్యాపారవేత్తలు తాము చేసే లావాదేవీల్లో మోసం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారు ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
