Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
100 సంవత్సరాల తరువాత ఏర్పడిన అరుదైన యోగం.. రాసిపెట్టుకోండి ఈరోజు నుంచి ఈ 3 రాశుల వారి సంపద పెరుగుతుంది!
నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి వస్తుంది. అదే రోజున 2024 సంవత్సరంలో చివరి సూపర్ మూన్ కూడా కనిపిస్తుంది. అయితే జోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఈ సూపర్ మూన్ సందర్భంగా 3 రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. వారి జీవితం అద్భుతంగా ఉండనుంది. అసలు సూపర్ మూన్ అంటే ఏమిటి? ఏ రాశుల వారికి ఈ సూపర్ మూన్ అదృష్టాన్ని ఇవ్వనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్ మూన్ అంటే ఏమిటి?
సూపర్ మూన్ రోజున చంద్రుడు భారీ రూపంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఎందుకంటే పౌర్ణమి సమయంలో చంద్రుడు భూమికి కక్ష్యకు అత్యంత దగ్గరగా వస్తాడు. దీని కారణంగా చంద్రుడు భారీ ఆకారంలో కనిపిస్తాడు. దీనినే సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు. దీనిని మీరు కంటితో కూడా చూడవచ్చు.

కార్తీక పూర్ణిమ నాడు సూపర్ మూన్: ప్రతి నెలలో పౌర్ణమి మరియు అమావాస్య వస్తుంది, అయితే కొన్ని పౌర్ణమి మరియు కొన్ని అమావాస్యలు జ్యోతిష్యం పరంగా చాలా ముఖ్యమైనవి. నవంబర్‌లో పౌర్ణమి 15వ తేదీన వస్తుంది. అదే నెలలో కార్తీకమాసం కావడం పైగా అది కార్తీక పౌర్ణమి కావడం చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే అదే సూపర్ మూన్ దర్శనమిస్తుండడంతో ఆ రోజుకు ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. దీని కారణంగా పలు రాశులు కూడా ప్రభావితం కానున్నాయి.
కార్తీక పౌర్ణమి నాడు గజకేసరి యోగం
కార్తీక పౌర్ణమి నాడు రాత్రి గజకేసరి యోగం వస్తుంది. అదే రోజు బుధాదిత్య రాజయోగం కూడా ఉంటుంది. ఈ యోగం దాదాపు 30 సంవత్సరాల తర్వాత కార్తీక పూర్ణిమ నాడు వస్తుంది. అలాగే ఈరోజు ఏర్పడుతున్న గజకేసరి యోగం సుమారు 100 సంవత్సరాల తరువాత వస్తుంది. ఇది కింద పేర్కొనబడిన మూడు రాశుల వారికి అదృష్ట జీవితాన్ని ప్రసాదించనుంది.
ఈ రాశుల సంపద పెరుగుతుంది
మేషరాశి
కార్తీక పౌర్ణమి నాడు వచ్చే శుభ యోగం వల్ల మేషరాశి జాతకుల జీవితంలో అద్భుత అభివృద్ధి ఉంటుంది. విష్ణువు అనుగ్రహం వీరిపై ఉంటుంది కాబట్టి, ఈ రాశివారు చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ యోగం సమాజంలో మీ స్థితిని పెంచుతుంది. వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, లక్ష్మీ అనుగ్రహం మీపై ఉన్నందున మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇల్లు కట్టాలన్నా, ఆస్తి కొనుగోలు చేయాలన్నా, వాహనం కొనాలన్నా ఈ యోగ బలం వల్ల నెరవేరుతుంది.
తులారాశి
ఈ యోగాలన్నింటి బలం వల్ల తులారాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబంలో పురోగతి ఉంటుంది, మీ ఆర్థిక స్థితి మెరుగుపడటంతో మీ సుఖాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. వృత్తి జీవితంలో మీరు ప్రమోషన్ పొందుతారు. మీ పని ప్రశంసించబడుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది.
మీనరాశి
ఈ యోగం మీన రాశి వారికి ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను కూడా లభించనుంది. శని దోషాలు ఉండడం వల్ల ఈ యోగం బలం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాకపోతే ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు మీ సంపద పెరుగుతుంది. దీంతో కష్టాల నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. కెరీర్ పరంగా ఈ కాలం చాలా మంచిది. జీవితంలో మరో మెట్టు ఎక్కాలంటే ఈ సమయంలో ప్రయత్నిస్తే ఫలితాలను పొందొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
