Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
surya, chandra grahan in 2025: 2025లో సూర్య, చంద్ర గ్రహణం తేదీలు ఇవే..బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇదే
2024 ఏడాదికి బైబై చెప్పడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ తో 2024 పూర్తి అవుతుంది. కొత్త సంవత్సరంతో ఉపవాసాలు, పండుగలు, వేడుకలు మొదలవుతాయి. కొత్త సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు(lunar eclipse), 2 సూర్యగ్రహణాలు(solar eclipse) ఏర్పడనున్నాయి. ముందుగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఎప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఆ తర్వాత సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య నాడు ఏర్పడుతుంది. అయితే 2025లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏ తేదీల్లో ఏ సమయాల్లో వస్తాయో ఇక్కడ చూడండి.
2025 మొదటి చంద్రగ్రహణం
మార్చి 14 శుక్రవారం ఉదయం 9.29 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3:29 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అని చెప్పవచ్చు. చంద్రగ్రహణం యొక్క సూతక్ కాలం గ్రహణం ప్రారంభ సమయానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం ఆసియా, మొత్తం యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది కానీ భారతదేశంలో కనిపించదు.

2025 రెండవ చంద్ర గ్రహణం
2025లో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 గంటలకు జరుగుతుంది. ఈ రోజు భాద్రపద పూర్ణిమ. ఈ గ్రహణం రాత్రి 01:26 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 28 నిమిషాల 2 సెకన్లు. ఈ చంద్రగ్రహణం సూతక కాలం మధ్యాహ్నం 12.19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.
2025 మొదటి సూర్యగ్రహణం
మార్చి 29 మధ్యాహ్నం 2:20 గంటలకు 2025లో మొదటి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం సాయంత్రం 6:13 గంటలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాలలో కనిపిస్తుంది. మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా దాని సుతక్ కాలం చెల్లదు.
2025 రెండవ సూర్యగ్రహణం
2025లో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి 10:59 గంటలకు జరుగుతుంది. ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఈ సూర్యగ్రహణం మరుసటి రోజు సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3.23 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపించనుంది. రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











