Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Surya dosham: ఆదివారం అవి తింటే సూర్యడికి కోపం..జీవితంలో కష్టాలు,అనారోగ్యం
జాతకంలో గ్రహ దోషం ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జాతకంలో సూర్యభగవానుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి వృత్తి,గౌరవం,ఆరోగ్యం మొదలైన అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోంటారు. సూర్య దోషం(surya dosham) తొలగించుకోడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని ప్రభావవంతమైన నివారణలు తెలుపబడ్డాయి. ఈ పరిహారాలు సూర్య దోషం యొక్క అశుభ ప్రభావాలను తొలగించి, సూర్యుడిని బలపరుస్తాయి. దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి.
ఆదివారం వస్తే చాలు చాలామంది ఇళ్లల్లోని వంటగదుల్లో పొద్దునే నాన్ వంటకాలు రెడీ అవుతుంటాయి. సండే అంటే చికెన్ డేగా పరిగణిస్తుంటారు కొందరు. సాధారణంగా మన దగ్గర నాన్ వెజ్ అంటే చికెన్ తినేటోళ్లు ఎక్కువ.. దీనికి కారణం మటన్ ధరలు ఎక్కువగా ఉండటమే. అయితే ఆదివారం కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వలన సూర్యుడికి కోపం వస్తుందని,జీవితంలో కష్టాలు వస్తాయని అనారోగ్యంతో ఇబ్బంది పడతారని నమ్మకం.
సనాతన ధర్మంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది తెలియక చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో పెద్దగా పట్టించుకోరు. ఆదివారం లేదా భానువారం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. నవగ్రహాలలలో సూర్యగ్రహం మొట్టమొదటి. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు స్థానం సరిగ్గా లేకపోయినా లేదా సూర్యుడు చెడు స్థానంలో ఉన్నా ఆదివారాలు ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఆదివారం వీటిని తినకూడదు
-ఆదివారం రోజు మద్యం లేదా మందుకి దూరంగా ఉండటం మంచిది.
-మీ జాతకంలో సూర్య దోషం ఉంటే ఆదివారం చేపలు తినకూడదు. ఆదివారం చేపలు తినడం అశుభం అని పండితులు చెబుతున్నారు.
-ఆదివారం ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ రోజున మనం తినే ఆహారంలో వీటిని లేకుండా చూసుకోవాలి. ఉల్లి,వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వీటిని ఆదివారం తినడం అనారోగ్యానికి కారణం అని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది.
-ఉసిరికాయలను ఆదివారం రోజున తినడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
-ఆదివారం పాలకూర కూడా తినకూడదు. ఆదివారం పాలకూర తినడం అశుభమని నమ్మకం.
-ఆదివారం రోజున చిక్కుడు,బీన్స్ వంటి వాటిని తినకూడదని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
