Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
Surya Grahan 2023: గ్రహణం రోజున గర్భిణీలు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఎందుకంటే?
గ్రహణాల చుట్టూ అనేక విశ్వాసాలు ఉంటాయి. కేవలం హిందూ సాంప్రదాయంలోనే కాకుండా చాలా సంస్కృతుల్లో గ్రహణాల గురించి చెప్పారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కొన్ని పనులు చేయాలని, మరికొన్నింటిని అస్సలే చేయొద్దని అంటారు పెద్దలు.
గర్భిణీలు గ్రహణ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దని చెప్పడం తెలిసిందే. 2023 లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన వస్తోంది. ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది.

గర్భిణీలకు సూర్యగ్రహణం హానికరమా?
మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలను చెడు శకునాలుగా, అశుభంగా పరిగణిస్తారు. గర్భిణీల విషయానికి వస్తే గ్రహణాలు తల్లిపై, పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. గర్భిణీలు చేసే పనుల వల్ల పుట్టబోయే బిడ్డలు వైకల్యంతో జన్మిస్తారని చాలా మంది నమ్ముతారు. దీనికి శాస్త్రీయ రుజువులు లేకపోయినా చాలా మంది విశ్వాసం ఇది.
సూర్యగ్రహణం వేళ గర్భిణీలు చేయాల్సిన పనులు:
* సూర్య గ్రహణం వేళ బయటకు వెళ్లకూడదు. గ్రహణం సమయం పూర్తయ్యే వరకు ఇంటిపంటునే ఉండాలి.
* గర్భిణీలు మెలకువగా ఉండాలి.
* సూర్య గ్రహణ సమయంలో మంత్రాలు పఠించాలి.
* సూర్య గ్రహణం ముగియగానే స్నానం చేయాలి.
* గ్రహణం వేళ ఇంట్లోకి కిరణాలు ప్రవేశించకుండా కిటికీలు మూయాలి, కర్టెన్లు కప్పాలి.
* సూర్య గ్రహణం సమయంలో ఏదీ తినకూడదని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ సమయంలో నీరసించి పోకుండా ఉండేందుకు కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, గ్లూకోజ్ వంటి తీసుకోవాలి.

సూర్యగ్రహణం వేళ గర్భిణీలు చేయకూడని పనులు:
* గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
* గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు వంటివి ఉపయోగించకూడదు.
* అప్పటికే వండి ఉంచిన ఆహారాన్ని తినకూడదు.
* గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆహారం వండుకుని తినాలి.
* సూర్యగ్రహణం వేళ దానిని చూడటానికి ప్రయత్నించవద్దు.
* ఈ సమయంలో నాన్ వెజ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. దీని వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications