Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే!
ఈ ఏడాది ఆగస్టు 12న ఆకాశంలో ఒక అద్భుత ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది, అదే సూర్యగ్రహణం. సూర్యగ్రహణం అనగానే ఖగోళ శాస్త్రవేత్తలకు ఎంత ఆసక్తో, జ్యోతిష్య శాస్త్రం, మన పురాతన సంప్రదాయాలను విశ్వసించే వారికి కూడా అంతే ఆసక్తి, భక్తి ఉంటాయి. గ్రహణం టైంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని, నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు.

గ్రహణానికి ముందు ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన మనస్సులో పాజిటివ్ ఎనర్జీ పెంచే ఒక అద్భుతమైన ప్రక్రియ. వాస్తు శాస్త్రం కూడా పరిశుభ్రతకు, ఇంటి అదృష్టానికి విడదీయరాని సంబంధం ఉందని చెబుతోంది.గ్రహణానికి ముందు, ఆ తర్వాత మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, పనులు ఏమిటో ఇక్కడ చూడండి.
సింహద్వారమే సిరుల వాకిలి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం గుండానే పాజిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి గ్రహణానికి ముందే గుమ్మాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని బూజు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవడం ఎంతో శుభప్రదం.
దేవుడి గది పవిత్రత
పూజా మందిరం ప్రశాంతతకు నిలయం. గ్రహణం పట్టేలోపే దేవుడి విగ్రహాలు, పూజా సామాగ్రి (గంటలు, హారతి పళ్ళేలు, శంఖాలు) తళతళలాడేలా కడిగి పెట్టుకోవాలి.
వంటగది
వంటగదిని మన హిందూ సంప్రదాయంలో అన్నపూర్ణా దేవి నివాసంగా భావిస్తారు. గ్రహణానికి ముందే వంటగదిని శుభ్రం చేసి, వండిన ఆహార పదార్థాలపై పవిత్రమైన తులసి ఆకులను వేయడం తరతరాలుగా వస్తున్న ఆచారంగా ఉంది.
తులసి కోట
సనాతన ధర్మంలో తులసి మొక్కకు విశేష స్థానం ఉంది. గ్రహణానికి ముందే తులసి కోటను, ఆ పరిసరాలను శుభ్రం చేయాలి. కానీ ఒక ముఖ్య గమనిక.. గ్రహణ సమయంలో పొరపాటున కూడా తులసి మొక్కను తాకకూడదు.
ఇల్లు ఊడ్చడం, పనికిరాని వస్తువుల తొలగింపు
గ్రహణ సమయంలో ఇల్లు ఊడ్చడం, తుడవడం లాంటి పనులు చేయకూడదు. అందుకే ముందే ఆ పనులు పూర్తి చేయాలి. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే బయట పడేయండి. అవి నెగెటివ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.
గ్రహణం విడిచాక ఏం చేయాలి?
సూర్యగ్రహణం పూర్తిగా ముగిసిన వెంటనే ఇంట్లోని వారంతా తలస్నానం చేయాలి. ఇల్లంతా గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. పూజ గదిని మళ్లీ శుభ్రం చేసుకుని, దీపారాధన చేసి ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మంత్ర జపం చేయాలి. ఆ తర్వాతే దైనందిన పనులు, భోజనం లాంటివి ప్రారంభించాలి.
ఇందులో సైన్స్ ఉందా?
నిజానికి గ్రహణానికి, ఇల్లు శుభ్రం చేయడానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు శాస్త్రీయంగా ఎక్కడా నిరూపితం కాలేదు. కానీ, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, పరిశుభ్రమైన వాతావరణంలో మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈ నియమాలను పాటించడం అనేది పూర్తిగా వారి వారి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications