Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
ఆశ్లేష నక్షత్రంలోకి సూర్య సంచారం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, ధనలాభం
వేదజ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని మిగతా గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అలాగే మిగతా గ్రహాలకు తండ్రిగా, అధిపతిగా చూస్తారు. ఆత్మ విశ్వాసానికి, ధైర్యానికి సూర్య గ్రహం సూచికగా చూస్తుంది వేదజ్యోతిష్యం. సూర్యుడు ఆగస్టు 3వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోకి సంచరించాడు. ఆశ్లేష నక్షత్రంలో ఆగస్టు 17వ తేదీ వరకు ఉండనున్నాడు. జ్యోతిష్య శాస్రం ప్రకారం గ్రహాల కదలిక, సంచారం, కలయిక, తిరోగమనం ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా ఉంటుంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి సంచారం మరింత ఎక్కువగానే ప్రభావం చూపిస్తుందని వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించి రీతిలో లాభం చేకూరనుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఆశ్లేష నక్షత్రంలోకి సూర్య సంచారం వల్ల ఏయే రాశుల వారు లాభ పడనున్నారో, ఏయే రాశుల వారికి అదృష్టం కలిసిరానుందో.. ఆయా రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కాలం కలిసి రానుంది. అదృష్టం వరించనుంది. ఈ ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి అద్భుతమైన సమయం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తలపెట్టే కార్యంలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి వారు లాభాలు అందుకోనున్నారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దంపతుల మధ్య బంధం బలపడుతుంది.
వృషభ రాశి
సూర్య సంచారం వల్ల వృషభ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు. ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు సంచరించడం వల్ల ఆగస్టు 17వ తేదీ వరకు వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితం సాఫీగా, సంతోషంగా, ఆనందంగా సాగుతుంది. ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉండనుంది. ఆరోగ్యంపై కాస్తంత శ్రద్ధ కనబరచడం మర్చిపోవద్దు.
మేషరాశి
ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు సంచరించడం వల్ల మేషరాశి స్థానికులకు అనుకూలంగా ఉండనుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఈ సంచారం వల్ల మేషరాశి వారు లాభాలు అందుకోనున్నారు. ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆస్తులు సొంతం చేసుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications