Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Taurus 2025 prediction: 2025లో వృషభ రాశి వారికి ఆ కష్టాలు తప్పవు!
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఆశలు,కొత్త కోరికలు,కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని అందరూ కోరుకోవడంతో పాటు కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉంటదో అని తెలుసుకోవాలని ఆశపడుతంటారు. అయితే కొత్త ఏడాదిలో అంటే 2025లో వృషభ రాశి వారికి అనేక కొత్త అవకాశాలు, మార్పులు వస్తాయి. కుటుంబం, ఉద్యోగం, విద్య, ప్రేమ, ఆస్తి, ఆరోగ్యం వంటి జీవితంలోని ప్రధాన రంగాలలో వృషభ రాశి వారికి 2025లో ఎలా ఉంటదో ఇక్కడ చూడండి.
ఆస్తి,వాహనం
2025లో వృషభ రాశి వ్యక్తులు భూమి, ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన ప్రణాళికల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మార్చి వరకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి, కానీ మే తర్వాత కొంత వివాదం తలెత్తవచ్చు. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది.

ఆరోగ్యం
2025లో వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా కాస్త మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది..అయితే మీ ఆహారంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఫిట్‌గా ఉండగలరు. మే తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
కుటుంబ జీవితం
2025లో వృషభ రాశి వ్యక్తుల కుటుంబ జీవితం బాగుంటుంది. సంవత్సరం ప్రారంభంలో శని అనుకూల స్థానం మీ సంబంధాలలో మాధుర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటలకు అంగీకరిస్తారు. మార్చి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది, ఇది ఇంట్లో ఆనందం, శాంతిని పెంచుతుంది. అయితే మేలో కేతువు స్థానం కొన్ని తేడాలను సృష్టించవచ్చు. అలాంటి సమయాల్లో ఓపికగా ఉండండి.
ప్రేమ,వివాహ జీవితం
ఈ సంవత్సరం ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి ప్రభావం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. అవివాహితులకు మే నాటికి వివాహ అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సంతానం సంతోషం కలిగే అవకాశం ఉంది కానీ మే తర్వాత సంబంధాలలో అపార్థాలు ఉండవచ్చు. కమ్యూనికేషన్, సహనం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు.
ఉద్యోగం,వ్యాపారం
వ్యాపారపరంగా వృషభ రాశి వ్యక్తులకు 2025లో చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం మంచిది. మార్చి నాటికి ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది. మే తర్వాత కొత్త ఉద్యోగం లేదా స్థాన మార్పు సూచనలు ఉండవచ్చు. మొత్తంమీద ఈ సమయం మీ కెరీర్ కు సానుకూలంగా ఉంటుంది.
విద్య,వృత్తి
విద్యార్థులు ఈ సంవత్సరం చదువులో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మార్చి వరకు బృహస్పతి సహకారంతో ఈ సమయం ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనుకూలం. అయితే మే తర్వాత దృష్టి మరల్చవచ్చు.
పరిష్కారాలు
ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించండి.
వెండి ముక్కను మీ దగ్గర ఉంచుకోండి. దీంతో రాబోయే సవాళ్లను సులభంగా అధిగమించగలరు, మీ జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications