Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
కృత్తిక నక్షత్రం 2 3 4 పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి, రెండు పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు. వృషభరాశికి అనగా ఎద్దు, రాశి చక్రంలో ఈ రాశి రెండవది ,ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వీరు దయ, దానము, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరైనా గాని వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. మీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వృషభ రాశి వాళ్లు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్న జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు? అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు? అలాగే ఎవరిని చేసుకుంటే కలసివస్తుంది? ఇటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొట్టమొదటగా వృషభరాశి వాళ్లు మేష రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే
మొట్టమొదటగా వృషభరాశి వాళ్లు మేష రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంత దూకుడు స్వభావం, తొందరపాటుతనం, తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిసామర్థ్యాలు, అలాగే మంచి దృఢమైనటువంటి శరీరం మనసు కలిగినటువంటి మేష రాశి వాళ్ళని వృషభరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య ఉన్నటి వంటి ద్విద్వాశ స్థితి వల్ల కొన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే వివాహం చేయాలి. అంటే వృషభ రాశి స్త్రీకి మేషరాశి పురుషులతో వివాహం చేయవచ్చు. అలా చేయటం వలన ఈ మేష రాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి పొందుతాడు చక్కటి కుటుంబ జీవనాన్ని పొందగలుగుతాడు అలా కాకుండా ఈ మేషరాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే ఏకమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకం కనుక బాగుండకపోయినట్లైతే , ఈ వృషభ రాశి పురుషుడు వ్యసనాలకు లోనవటం, నిరుత్సాహ పడిపోవడం ఇబ్బందులకు గురి అవుతారు.కాబట్టి ద్విద్వాదశ స్థితిలో ఉన్న రాశులు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళ జాతకాన్ని పరిశీలించి అయితే తప్ప వివాహం చేయరాదు చెప్పిన ప్రత్యేకమైన సందర్భంలో అంటే వృషభ రాశి స్త్రీకి మేష రాశి పురుషులతో పరిస్థితుల్లో వాళ్ళ జాతకం కలిస్తే మాత్రమే వివాహం చేయాలి.

వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మొదటి సందర్భం ఏమిటి అంటే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే వాళ్ల జీవితం బాగానే ఉంటుంది. అనోన్యంగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఈ ఓకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయడం వలన ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వచిన్నప్పుడు తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశికి ఉండవు. ఈ కాబట్టి కొద్దిగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితేనే వృషభ రాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేయాలి. లేకపోతే చేయకుండా ఉండడమే మంచిది.

వృషభ రాశి వాళ్లు మిధున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లైతే
వృషభ రాశి వాళ్లు మిధున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లైతే ద్వంద స్వభావం కలిగిన మిధున రాశి వాళ్లను వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లైతే ఖచ్చితంగా వీళ్ల మధ్య గొడవలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితి వల్ల మిధున రాశి వాళ్ళ ని నాణ్యానికి రెండు వైపు చూసిన వృషభ రాశి వాళ్ళు మానసికంగా తట్టుకోలేక మిధున రాశి వారి నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకు వివాహం జరిపించాలి. ముఖ్యంగా వీళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మిథునరాశి స్త్రీకి వృషభ రాశి పురుషులతో వివాహం చేయవచ్చు. అప్పుడు ఈ వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా మంచి బలోపేతం అయినటువంటి స్థితికి వెళ్తాడు చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాడు. అలా కాకుండా మిధున రాశి స్త్రీ, వృషభ రాశి పురుషుడిని వివాహం చేసుకున్న కచ్చితంగా వాళ్ళ మధ్య గొడవలు వచ్చి విడిపోయే పరిస్థితి కలుగుతుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి . లేదంటే వీళ్లిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉండడమే మంచిది .

వృషభ రాశి వాళ్లు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వాళ్లు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్దంగానే కుటుంబం అంటే ఆపేక్ష పిల్లలు అంటే అభిమానం బంధుప్రీతి , సొంత వాళ్ల మీద మమకారం చక్కటి ఆలోచన శక్తి కలిగిన కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారికి మధ్య అన్యోన్యమైన జీవితం ఉంటుంది. మంచి ఆలోచనల భావాలతో ఉన్న ఈ వృషభరాశి వాళ్లు ప్రేమ స్వరూపమైన కర్కాటక రాశి వాళ్లు వివాహం చేసుకుని సుఖభోగాలు ఆనందాన్ని పొందగలుగుతారు. వీరి జాతకాలు కలిస్తే ఈ వృషభ రాశి వారికి కర్కాటకరాశి వాళ్లను ఇచ్చి వివాహం చేయవచ్చు . వీళ్లకి కలిగే సంతానం కూడా మంచి సంతానం . మహార్జాతకులు పుడతారు. కాబట్టి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయవచ్చు.

వృషభ రాశి వాళ్లు సింహ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వాళ్లు సింహ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మంచి సంబంధం ఏర్పడుతుంది ఈ సింహ రాశి వాళ్ళ యొక్క క్రమ శారీరక మానసిక దృఢత్వం ఈ వృషభ రాశి వారిని ఆకర్షిస్తుంది కొన్ని సందర్భాల్లో అహంకారపూరిత స్వభావాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు ఓర్పుగా భరించగలరు వీళ్ళిద్దరికీ జాతకాలు కలిస్తే చక్కగా వివాహం చేయవచ్చు ఇలా చేయడం వలన వీళ్ళిద్దరికీ కూడా చక్కటి ఉన్నత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏర్పడతాయి వ్యవహారాల్లో జయం కలుగుతుంది అలాగే రాజకీయ సామాజిక అభివృద్ధి సాధి మంచి పదవులు పొందుతారు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

వృషభ రాశి వాళ్లు కన్య రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వాళ్లు కన్య రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ వృషభ రాశి వారు కన్య రాశి వాళ్ళని ప్రోత్సహించే స్వభావం కలిగి ఉంటుంది. అలాగే కన్య రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని సపోర్ట్ చేయడం వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకోవడం వలన వీ అనుబంధం ఏర్పడుతుంది. అలాగే ఆర్థికంగా ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో వీలు కచ్చితంగా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వాళ్లకి కన్యా రాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే మంచి ఫలితాలను పొందుతారు

వృషభ రాశి వారు తులా రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వారు తులా రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ధర్మము అనే వాటి మీద నమ్మకం దృఢమైన మనస్తత్వం ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఉన్న ఎక్కువ గొడవలు జరిగి విడిపోయే పరిస్థితి రావడం ఈ తులా రాశి వాళ్ళు ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల బానిస కావడం కొన్ని జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరి అయితే వీరి జాతకాలు కలిస్తే తప్ప చూసి వివాహం చేయాలి వృషభ రాశి ఈ తులా రాశి వారిని ఇచ్చి వివాహం చేయరాదు.

వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య చాలా ఆకర్షణ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. కోపం తీవ్రమైన ప్రేమ కలిగిన వృశ్చిక రాశి వారు ఈ వృషభ రాశి వారిని కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధాటికి వృషభ రాశి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి జాతకాలు కలిస్తే పర్వాలేదు అనుకుంటే వివాహం చేయాలి. లేకుంటే చేయకుండా ఉండటమే మంచిది.

వృషభ రాశి వారు ధనుస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వారు ధనుస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు. ఆధ్యాత్మిక భావనలు మొండితనం పట్టుదల కలిగిన ఈ ధనస్సు రాశి వాళ్ళని ఈ వృషభ రాశి వాళ్లు చాదస్తం కలిగిన మనుషులుగా లెక్కవేసి తక్కువగా చూస్తారు వివాహ బంధం నిలబడదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారికి ధనుస్సు రాశి వారికి వివాహం చేయకుండా ఉండడమే మంచిది సింహ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్లతో వివాహం చేసినట్లు అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి వారు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే
వృషభ రాశి వారు మకర రాశి వాళ్ళు ఈ వృషభ రాశి వారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు ప్రేమాభిమానాలు కలిగిన చాలా బాగా రిసీవ్ కాబట్టి వీరి జాతకాలు కలిస్తే వివాహం చేయవచ్చు ఏర్పడుతుంది గొప్ప వాళ్ళు పుట్టే టువంటి పరిస్థితి వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిపించిన పేదరికంలో ఉన్న వాళ్ళ అయినా సరే వాళ్లకి దశ కలిసి వచ్చే కొద్దీ అత్యంత ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కనుక చక్కగా ఈ వృషభరాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు.

వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే
వృషభ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్లతో వివాహం చేసినట్లయితే వీరిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ బంధం వలన మంచి సంసార జీవితం పిల్లలు ఆరోగ్యం కలుగుతారు. ఆవేశపూరితమైన కుంభ రాశి వారు ప్రేమ విషయంలో మంచి అభిమానం స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు ఎటువంటి దురాలోచనలు ఉండవు, వీరితో వివాహం చేసినట్లయితే వివాహ సంతోషంగా జీవిస్తారు అలాగే వీళ్ళకి ఉన్నతమైన సంతానం కలుగుతుంది అలాగే వీరిద్దరి మధ్య వివాహం జరిపించిన వాళ్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి స్థానంలో ఉంటారు. వీరి స్థానలు కలిస్తే వృషభ రాశి వాళ్ళకి కుంభ రాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు.

వృషభ రాశి మీన రాశి వాళ్లతో వివాహం చేసినట్లైతే
వృషభ రాశి మీన రాశి వాళ్లతో వివాహం చేసిన సహజంగానే మృదు స్వభావం మీనరాశి వాళ్ళని చూసి ఎంతో ముచ్చట పడిపోతారు కారణం ఏంటంటే వృషభరాశి వాళ్లు మీన రాశి వాళ్ళని చక్కటి గౌరవంతో రిసీవ్ మీన రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ల మీద ఉన్న ప్రేమతో వీళ్ళతో చక్కగా కలిసిపోతారు వివాహ బంధం చాలా బాగుంటుంది ఏమాత్రం జాతకాలు కలిసిన ఇచ్చి వివాహం చేయవచ్చు ఇద్దరు కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు వీళ్లు కాలానుగుణంగా మంచి ఆర్థిక అభివృద్ధిని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











