విపరీత రాజయోగం: అక్టోబర్‌ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేకత ఉంది. జ్ఞానం, సంపద, ఆనందం, సంతానం, అదృష్టానికి అధిపతి అయిన గురు ప్రభావం పలు రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రహం కర్కాటక రాశిలో ఉండగా.. అక్టోబర్‌ 31 వరకు అక్కడే కొనసాగుతుంది. ఈ క్రమంలో హంస, విపరీత రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల వల్ల కొంతమందికి అదృష్టం విపరీతంగా పట్టనుంది. మరి ఆ రాశులేంటి.. వారికి ఎలా కలిసి రానుంది.. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం..

The grace of Jupiter upon these zodiac signs due to a powerful Raja Yoga

సింహ రాశి

విపరీత రాజయోగంతో సింహరాశి వారికి విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రయోజనం కలగనుంది. విదేశాలకు వెళ్లాలన్న మీ కోరిక నెరవేరడంతో పాటు ఇంపోర్ట్‌- ఎక్స్‌పోర్ట్‌ సంబంధిత వ్యాపారాల్లో లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తి కావచ్చు. ఆశించిన విజయాలు అందుకుంటారు. ఇంట్లో గురు దృష్టి సానుకూలంగా ఉండటంతో కన్న తల్లి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసేందుకు ప్లానింగ్‌ చేసుకుంటారు. కొత్త పరిచయాలు పెంచుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గురు గ్రహం ఎనిమిదో పాదంలో సంచరిస్తున్న కారణంగా వారికి ఇప్పటికే ఉన్న ఒడుదొడుకులు, అనిశ్చిత పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెగిటివిటీ తొలగిపోతుంది. దీంతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విపరీత రాజయోగం ప్రభావంతో ఆకస్మిక ఆర్థిక లాభాలు అందుకుంటారు. మీ డబ్బు మీకు తిరిగి అందుతుంది. బీమా సొమ్ము అందుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి పెండింగ్‌ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఆస్తి కొనుగోలు, ఇల్లు వంటి ప్రణాళికలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి.

The grace of Jupiter upon these zodiac signs due to a powerful Raja Yoga

కుంభ రాశి

బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్‌ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్‌ డేస్‌.!బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్‌ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్‌ డేస్‌.!

కుంభ రాశి వారికి గురు గ్రహ ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవుతాయి. పాత అప్పుల నుంచి ఉపశమనం కలిగే శుభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపుతో కలిసి వస్తుంది. ఆఫీసు రాజకీయాలను ఎదుర్కొనేందుకు మీరు సరైన వ్యూహంతో సిద్ధంగా ఉంటారు. కోర్టు కేసుల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీతో పోటీ ఉన్నవారితో గెలుపోటముల విషయంలో మీదే పై చేయి అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, September 6, 2026, 6:32 [IST]
Desktop Bottom Promotion