Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
నక్షత్రం మార్చుకున్న చంద్రుడు.. మార్చి 16 నుంచి ఈ 2 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
మానవ జీవితంలో జ్యోతిష్య శాస్త్రం అతిముఖ్యమైన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి జీవితం యొక్క ఆధ్యాత్మిక, భవిష్యత్తు, జీవితం ఇలా అన్నిటినీ తెలుసుకోవడానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనిషి నేర్చుకునే మంచి చెడును అంచనా వేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. మన తాతల కాలం నుంచి ఈ శాస్త్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థానాలు, అవి సంచరించే రాశులు ముఖ్యమైనవి.
గ్రహాలూ అన్నీ ఒక నిర్దిష్టమైన కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. అలాగే తమ సంచార స్థానాన్ని మార్చుకుంటూ కనిపిస్తుంటాయి. దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాశులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అలా ప్రభావితం అయినప్పుడు కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు వస్తాయి. అయితే ఈ నవగ్రహాల్లో చంద్ర గ్రహం అత్యంత వేగంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. దీని కారణంగా ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటాడు.

అయితే చంద్రుడు ఈ నెల 16వ తేదీన, ఉదయం 12:51 గంటలకు, ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. వారి జీవితాల్లో శుభ ఫలితాలు, విజయాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
మిథున రాశి
చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించడం వలన మిథున రాశికి చెందిన వ్యక్తులకు మార్చి 16వ తేదీ అనేది చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆరోజు ఈ రాశికి చెందిన వారు అనేక శుభ ఫలితాలు అందుకుంటారు. చిన్న చిన్న అవకాశాలు కూడా మంచి పాజిటివ్ అంశాలుగా మారుతాయి. కెరీర్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. ఈ రాశి వారు, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయంలో పెట్టాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి, సమాజంలో మంచి పేరు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో తాము అనుకున్న లక్ష్యానికి ఈరోజు వీరు దగ్గరగా వెళ్తారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి
చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించడంతో కర్కాటక రాశి వారికి విశేష అనుకూలతలు కనిపిస్తాయి. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేయాలనుకుంటే, వాటికి తగిన విధంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం లభిస్తుంది. అలాగే, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవ్వడంతో మీ కార్యం సిద్ధిస్తుంది. కుటుంబ జీవితం కూడా సంతోషమయంగా, ఆనందమయంగా ఉంటుంది. చంద్రుడు తన నక్షత్రాన్ని మార్చుకోవడం వలన ఈ రెండు రాశుల వారు బాగా మంచి ప్రయోజాలను పొందుతారు. ఇందులో మీ రాశి కూడా ఉందొ లేదో చెక్ చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications