Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, చంద్రుల గోచారం మన దైనందిన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుండగా మరికొన్ని రాశుల వారికి సాధారణంగా, కొందరికి సవాలుగా ఉంటుంది. ఈ క్రమంలో చంద్ర గోచారంతో పలు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

జులై 23 కొన్ని రాశుల వారికి ఒక ప్రత్యేకమైన రోజు కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు చంద్రుడు శుక్రుని రాశి అయిన తులారాశిని వదిలి.. కుజుని రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నారు. జులై 25 వరకు అక్కడే ఉంటుండగా ఈ చంద్ర సంచారం అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఈ మూడు రోజులు వారికి ప్రత్యేకంగా ఉండటంతో పాటు పలు మార్పులను తీసుకువస్తుంది. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి లభించవచ్చు. ఆ రాశులు ఏంటో చూద్దాం..
కర్కాటక రాశి
జులై 23 నుంచి జులై 25 వరకు కర్కాటక రాశి వారికి కొత్త ఆశలను తీసుకువస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. వృత్తిపరమైన ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలను అందుకోవచ్చు. ఈ కాలంలో కొత్త వ్యక్తులను కలవడం మీ భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో, ఆఫీసులో సంతోషకరమైన వాతావరణం అనుభవిస్తారు. మీ ప్యాషన్ ద్వారా గుర్తింపు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరమైన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ మూడు రోజులు శుభసూచకమైన సంకేతాలతో ఆనందంగా ఉంటారు.

సింహ రాశి
రానున్న మూడు రోజులు సింహ రాశి వారికి ఆర్థికపరంగా లాభదాయక మార్గాలు తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయని విశ్వసిస్తారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి కనిపిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండటంతో మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. సమాజంలో మీ ప్రతిష్ఠ మునుపటి కంటే మెరుగ్గా ఉండటంతో గౌరవంగా ఉంటారు. వ్యాపార రంగంలో మంచి ఫలితాలను అనుభవిస్తారు.
వృశ్చికం
రాబోయే మూడు రోజులు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తుండటంతో ఈ కాలం ఈ రాశి వారికి మరింత ప్రత్యేకంగా, ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం మరింతగా పెరగడంతో ఉద్యోగంలో లేదా వ్యాపార రంగంలో సానుకూల ఫలితాలు చూస్తారు. మీరు చాలా కాలంగా చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం లేదా ఫ్రెండ్స్‌తో కలిసి యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో, ఆఫీసులో సంతోషకరమైన వాతావరణం చూస్తారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
