Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
జులై 21 లోపు కన్యా రాశివారికి జరిగే అద్భుతాలు ఇవే..!
పౌర్ణమి లోపు కన్యారాశి వారిలో 8 సంఘటనలు జరుగబోతున్నాయ్. ఈ సమయంలో వీరి గోచార ఫలితాలు ఎలా వుండబోతున్నాయ్. వీరికి జరగబోయే సంఘటనలు ఏంటి లాంటి విషయాలను తెలుసుకుందాం. జీవితంలో విజయం సాధించడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధనలు ఏంటి, పాటించాల్సిన పరిహారాల గురించి ప్రముఖ పండితులు ఏమిఅంటున్నారో తెలుసుకుందాం.

కన్యా రాశివారు దయాగుణం, దాన గుణం, క్షమా గుణాన్ని కలిగి వుంటారు. తెలివితేటలు అధికంగా వుంటాయ్. కార్య దీక్షత కార్య దక్షతను కలిగి వుంటారు. మంచి చెడు ఆలోచించిన తరువాత కార్య సాధన చేస్తారు. అపజయాలు ఎదురైతే కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి వుండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకులంగా వుండబోతున్నాయ్. వీరికి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గతంలో డబ్బులు లేక చేయలేక పోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీకు వఈత్తి, విద్యా, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయ్.
చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు వున్నాయ్. పని ఒత్తిడి ఎక్కువౌతుంది. పై అధికారుల ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు కూడా గురౌతారు. సహోద్యోగుల సహకారంతో అనుకున్న పనులను అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం, యోగా, ధ్యానం చేయడం వల్ల వీరి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.
వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయ్.ఈ సమయంలో వ్యాపారంలో పోటీని తట్టుకొని నిలబడితే కనుక మీ వ్యాపారం విస్తరించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసేవారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వుండాలి. విద్యార్ధులకు అనుకూల ఫలితాలున్నాయ్.

కన్యారాశి వారికి ఈ సమయంలో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకుందాం. ఏ విషయం గురించైతే మీరు ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారో ఆ విషయంలో మీరు అనుకూల ఫలితాలను చూడబోతున్నారు. మీరు కోరుకున్న ఏ రంగమైనా అనుకూల ఫలితాలు వస్తాయ్.
పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులకు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశివారు మాట్లాడే ప్రతీ మాట కూడా ఆచీతూచీ మాట్లాడాలని, వీరి దగ్గరి మనుషుల గురించి వేరొకరికి చెప్పడం వల్ల కష్టాలను కొనితెచ్చుకున్న వారౌతారు.
ఈ రాశివారు పాత మిత్రులను కలిసే అవకాశాలు ఎక్కువగా వుంటాయ్. వారి వల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. వివాహం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ వుంటారు. అలాంటి వారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీరు కోరుకున్న లక్షణాలు వున్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రానున్నారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా వుంటుంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఏవైనా చిన్న విభేదాలు వుంటే అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయ్. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ్. విడిపోయిన వారితో మళ్లీ బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. వారితో మళ్లీ బంధం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సంతానం కోసం ఎదురుచూసే వారు కూడా శుభవార్త వినే అవకాశం వుంది.
రాజకీయ రంగంలో వున్నవారు ఏదైనా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అధికారంలో వుండే రాజకీయ నాయకులు అండదండలు కూడా వీరికి వుండబోతున్నాయ్. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications