ఈ నాలుగు రాశుల వారిపై శివుడి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయ్..! మీది ఈ రాశేనా..?

జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులున్నాయన్న విషయంలో తెలిసిందే. అయితే ఈ 12 రాశుల్లో 4 రాశులు మాత్రం శివుని అంశంతో వచ్చాయ్. ఈ 4 రాశులంటే శివుడికి చాలా ఇష్టమట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం. ఈ నాలుగు రాశుల వారిలో వుండే లక్షణాలంటే శివుడికి చాలా ఇష్టం అందుకే నాలుగు రాశులు శివుని అంశంతో వచ్చాయంటారు. తన కృపను ఈ నాలుగు రాశులపై ఎప్పుడూ వుంచుతాడని పండితులు చెబుతున్నారు. తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి ఆశీస్సులు ఇస్తాడు. వారు అడగ్గానే వరాలిస్తాడు. ఈ 4 రాశులవారు ఎప్పుడూ శివుడి పట్ల విధేయతను కలిగి వుంటారు. ఆ నాలుగు రాశుల వారు ఎవరు, ఆ నాలుగు రాశుల వారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.

కన్య రాశి

కన్య రాశి చాలా స్వచ్ఛమైనది. వీరు చాలా సున్నితమైన మనసును కలిగి వుంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా ప్రతి ఒక్కరితో పంచుకుంటారు. వీరిలో క్షమాగుణం ఎక్కువ, వీరు మంచి క్రమశిక్షణను కలిగివుంటారు. వీకి మనసు కూడా చాలా విశాలమైనది. వీరు ఏది పొందాలన్నా కష్టపడి పొందాలనుకుంటారు. మోసపూరితంగా పొందాలని అస్సలు అనుకోరు. ఇతరులను ఎక్కువగా నమ్మి మోసపోయే లక్షణాన్ని కలిగి వుంటారు. వారు ఇష్టపడే వ్యక్తులను ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఇతరుల సొమ్మును ఆశించరు. వారికి ఏదైనా సమస్య వచ్చినా, కుటుంబ సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడతారు, కానీ ఎవ్వరి సహాయాన్ని తీసుకోరు. వీరు ప్రతి విషయంలో నిజాయితీగా వుంటారు. భాగస్వామి దగ్గర ఏ విషయాన్నీ దాచిపెట్టరు. శివుడు వీరికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అది వారి ఎదుగుదలకోసమేనని వీరు అర్ధం చేసుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. సంస్కృతీ సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని బలంగా నమ్ముతారు. మనల్ని గొప్ప స్థానంలో వుంచుతాయ్. అలాగే మనకి మంచి పేరు ప్రతిష్టలను తీసుకొని వస్తాయ్. కర్కాటక రాశివారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ, నమ్మకం వుంటుంది. వీరు సరైన మార్గంలోనే వెళ్లాలనుకుంటారు. అడ్డదారులు వీరికి అస్సలు నచ్చవు. వీరు ఏ పనిచేసినా తగిన ఫిలితాన్ని అస్సలు ఆశించరు. వీరు ప్రతీ పనిని మనస్పూర్తిగా చేస్తారు. వీరు కుటుంబ సభ్యులపైన కొంచెం అతి జాగ్రత్తతో వుంటారు. శివుడు తన దయను ఎప్పుడూ కర్కాటక రాశిపైనే వుంచుతాడు. కర్కాటక రాశి వారికి సహాయ గుణం ఎక్కువ అందుకే శివుడు ఎప్పుడూ వీరికి తోడుగా వుంటాడు.

these-4-zodiac-signs-come-out-of-lord-shiva-and-shiva-loves-these-4-zodiac-signs

మేషరాశి

మేషరాశికి చెందిన వారు ఎప్పడూ భగవన్నామస్మరణ చేస్తూనే వుంటారు. భగవంతునిపై వీరికి భక్తి ఎక్కువగా వుంటుంది. వీరు ప్రతీ రోజూ దేవున్ని పూజిస్తారు. భగవంతున్ని ఏ విషయంలో కూడా అస్సలు నిర్లక్ష్యం చేయరు. వీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. ప్రతీ పండగను చక్కగా నియమనిబంధనలతో జరుపుకుంటారు. వీరికి పండగలన్నా, ఆచారవ్యవహారాలన్నా చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తారు. తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని నమ్ముతారు. అందుకే శివుడికి ఈ రాశివారంటే కూడా చాలా ఇష్టం.

కుంభరాశి

కుంభ రాశి వారికి కూడా దైవం పట్ల భక్తి ఎక్కువగానే వుంటుంది. వీరు తమ భక్తిని బయటకు చూపించరు. ఎవ్వరూ లేనప్పుడు వీరు తమ భక్తిని దేవుడి వద్ద చూపిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఎవరు కష్టాల్లో వున్నా చూడలేరు. వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. కూర్చున్నచోటే అన్ని పనులూ జరగవని నమ్ముతారు. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనే తపనను కలిగి వుంటారు. ఈ రాశికి చెందిన వారు అబద్ధాలు ఆడరు. వీరు చాలా అమాయకులు, మంచివారు, అందుకే కుంభరాశివారంటే శివుడికి కూడా ఇష్టం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, June 3, 2024, 13:01 [IST]
Desktop Bottom Promotion