Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
ఈ 5 రాశుల వారితో ప్రేమలో ఉన్నారా? అయితే జర భద్రం!
ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. రెప్పపాటు క్షణంలో ప్రేమలో పడి జీవితాంతం అదే ప్రేమతో జీవించిన వాళ్లు చాలామందే ఉన్నారు..అదే సమయంలో చిన్న చిన్న మనస్పర్థలకే మధ్యలో విడిపోయేటోళ్లు కూడా ఉన్నారు. ప్రేమ ప్రయాణం పూల పాన్పులా సాఫీగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు.. కానీ ఏ బంధంలోనైనా చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు, ఒడిదుడుకులు సర్వసాధారణం అని అర్థం చేసుకోడంలోనే అసలు కథ అంతా ఉంది. అలకలు, బుజ్జగింపులు ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని అంటారు.
అయితే కొందరికి మాత్రం ఈ గొడవలను భరించే ఓపిక, సర్దుకుపోయే సహనం ఉండవు. చిన్న సమస్య రాగానే, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఆ బంధానికే ముగింపు పలకాలని చూస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఐదు రాశుల వ్యక్తులు ఈ విషయంలో ముందుంటారట. చిన్న చిన్న కారణాలకే తమ భాగస్వామికి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధపడతారు. ఇంతకీ, ఆ రాశులేంటో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

మిథున రాశి
ఈ రాశి వారు గాలిలాంటి వ్యక్తులు. స్వేచ్ఛను, ఇండిపెండెన్స్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వీరి ఆలోచనలు, నిర్ణయాలపై ఎవరైనా అజమాయిషీ చెలాయించాలని చూస్తే మాత్రం దబిడి దిబిడే. ప్రేమ పేరుతో తమకు హద్దులు గీయాలని, ఆంక్షలు పెట్టాలని భాగస్వామి ప్రయత్నిస్తే ఆ బంధం వారికి ఓ పంజరంలా అనిపిస్తుంది. అనవసరమైన గొడవలు, అశాంతి అంటే వీరికి చిరాకు. ప్రశాంతతను కోరుకునే వీళ్లు, తమ భాగస్వామి నిత్యం కలహాలకు దిగుతున్నా, చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తున్నా, ఆ బంధం నుండి వీలైనంత త్వరగా బయటపడటమే మంచిదని నిర్ణయించుకుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వ్యక్తులు అత్యంత సున్నితమైన, భావోద్వేగమైన మనసున్న వారు. వీరు ప్రేమలో పడితే తమ ప్రపంచం మొత్తం భాగస్వామే అనుకుంటారు. భాగస్వామి సంతోషం కోసం ఏం చేయడానికి సిద్ధపడతారు. తమ సర్వస్వాన్ని ధారపోసి ప్రేమిస్తారు. అయితే వారి ప్రేమకు, త్యాగానికి అవతలి వారి నుండి సరైన గుర్తింపు, విలువ లభించనప్పుడు తీవ్రంగా గాయపడతారు. తాము ఆ బంధంలో ప్రాధాన్యత కోల్పోయామని, తమ ఉనికిని పట్టించుకోవడం లేదని వారికి అనిపించిన క్షణం ఇక ఆ బంధంలో కొనసాగడం అనవసరమని భావిస్తారు. మౌనంగానే ఆ ప్రేమకు దూరమైపోతారు.
తుల రాశి
తుల రాశి వారు ప్రశాంతతకు, సామరస్యానికి ప్రతీకలు. సంబంధం మొదట్లో అంతా అందంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, రోజులు గడిచేకొద్దీ వాస్తవాలు బయటపడతాయి, భాగస్వామిలోని లోపాలు కనిపిస్తాయి. ఇది సహజమే అయినా తుల రాశి వారు ఈ మార్పును జీర్ణించుకోలేరు. నిత్యం గొడవలు, వాదనలతో కూడిన జీవితం వారికి నరకంలా తోస్తుంది. సమస్యలను ఎదుర్కొని, వాటిని పరిష్కరించే బదులు, ఆ సమస్యల నుండే దూరంగా పారిపోవాలని చూస్తారు. అందుకే బంధం చేదుగా మారుతోందని అనిపించగానే విడిపోవడమే ఉత్తమ మార్గమని తేల్చేస్తారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కూడా స్వేచ్ఛ అంటే ప్రాణం. జీవితాన్ని వీరి ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటారు. ఎవరైనా వీరిని అదుపు చేయాలని చూసినా, అలా చెయ్, ఇలా చేయొద్దు అని నియంత్రించాలని ప్రయత్నించినా తిరగబడతారు. భాగస్వామి ప్రతి మాటకు తల ఊపే రకం కాదు. తమ వ్యక్తిత్వాన్ని చంపుకొని బంధంలో ఉండటానికి ఇష్టపడరు. ఈ కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు వాటితో పోరాడే బదులు, ఆ బంధాన్ని వదులుకొని తమ స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతారు.
మీన రాశి
ఈ రాశి వారు తమకంటూ ఓ అందమైన కలల ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో జీవిస్తుంటారు. వీరి ప్రేమ కూడా ఓ అద్భుతమైన కావ్యంలా ఉండాలని ఊహించుకుంటారు. కానీ ప్రేమలో వాస్తవికత ప్రవేశించినప్పుడు అంటే బాధ్యతలు, సమస్యలు ఎదురైనప్పుడు తట్టుకోలేరు. భాగస్వామి ప్రవర్తన, వాస్తవిక దృక్పథం వీరికి భరించలేనివిగా అనిపిస్తాయి. వీరి కలల ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి మధ్య ఉన్న అగాధాన్ని చూసి ఆ బంధం తమకు సరికాదని నిర్ణయించుకొని ఇద్దరి దారులు వేరని చెప్పేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications