Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2025 మహా శివరాత్రి రోజున అసలైన అదృష్టమైన రాశులు ఇవే.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
రేపే మహా శివరాత్రి భక్తులందరూ ఇప్పటి నుంచి శివ నామస్మరణ చేస్తూ.. భక్తిలో మునిగిపోతున్నారు. పార్వతీ పరమేశ్వరుల దీవేలను పొందేందుకు భక్తులందరూ ఆ భోలేనాథుడిని కొలుస్తుంటారు. పూజలు చేయడం, ఉపవాసం ఉండడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం చేసే పూజలు, పునస్కారాలు మంచి శాంతిని, శక్తిని అందజేస్తాయట. అయితే ఈ శివరాత్రి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఆ రాశుల వారికి మంచి అదృష్టం పట్టుకోనుంది. ఆ రాశులు ఏవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ శివరాత్రి మేష రాశివారికి కొత్త ఉత్సాహం, శక్తిని అందిస్తుంది. ఇది ఈ రాశి వారికి వారి లక్ష్యాలను సాధించడానికి సరైన సమయంగా ఉంటుంది. శివుని ఆశీర్వాదంతో, మీరు అన్ని అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తారు. శివుడి ఎనర్జీ, ఆ శాంతి మీకు లభిస్తుంది.

వృషభ రాశి: వృషభ రాశివారికి ఈ మహా శివరాత్రి నుంచి శాంతి మరియు సంపదను తీసుకువస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో మీరు అనుకున్న కార్యక్రమాలన్నిటినీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి: మహా శివరాత్రి తరువాత కర్కాటక రాశివారికి భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉండడం వలన ఈ రాశి వారు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా వీరు ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందడమే కాకుండా, వాటి ద్వారా గొప్ప లాభాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ధ్యానంతో ఆంతరంగిక శాంతిని పొందగలుగుతారు.
సింహ రాశి: ఈ మహా శివరాత్రి సింహ రాశి వారికి సృజనాత్మకత పెంచనుంది. మీరు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవడం ద్వారా కొత్త అవకాశాలు పొందగలుగుతారు. శివుని ఆశీర్వాదం వల్ల మీరు మీ ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా గొప్ప లాభాలను పొందుతారు.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశివారికి ఈ శివరాత్రి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. మీరు ఉన్నత విద్యా, ఆధ్యాత్మిక అంశాలలో ఆసక్తి చూపుతారు. గురువులు మరియు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. గొప్ప గొప్ప విషయాల్లో మీరు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు.
మీన రాశి: మీన రాశివారికి ఈ మహా శివరాత్రి అదృష్టాన్ని తెచ్చే పండుగ. మీ సృజనాత్మకత ద్వారా కొత్త అవకాశాలు సొంతం చేసుకుంటారు. దీని కారణంగా ఆర్థికపరమైన పురోగతి కనిపిస్తుంది. కళా రంగంలో ఉన్నవారికి గౌరవం మరియు ప్రసిద్ధి లభిస్తుంది. అలాగే గొప్ప గొప్ప అవకాశాలు మీ జీవితాలను మార్చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications