Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్లకూడని ప్లేస్ లు ఇవే..ఉత్త చేతులతో వెళ్తే కష్టాలు మీకే!
భారతీయ సంస్కతిలో అతిథిని దైవంగా భావిస్తారు. ఇంటికి వచ్చిన అతిథిని దేవుడితో సమానంగా ట్రీట్ చేస్తారు. అతిథుల ఇళ్లను సందర్శించడం చాలా సాధారణ విషయం. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అతిథుల ఇళ్లను సందర్శిస్తాం. అతిథి అంటే తిథి,వార,నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అయితే సాధారణంగా మనం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులను మనతో తీసుకువెళ్తుంటాం. కానీ అన్నీ సమయాల్లో ఏదో ఒకదాన్ని తీసుకెళ్లడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల మనం ఏమీ తీసుకెళ్లలేకపోవచ్చు. అయితే ఇలా చేయడం సరికాదు.
భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం ఇచ్చారు. అతిథి దేవోభవ అని,అతిధిని దైవ సమానుడిగా చూడమని చెప్పారు. ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం. ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో..ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు తన చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళిపోతాడు. అంటే అతిథి సేవ చేయని వాడు అంతకుముందు చేసుకున్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాకుంగా కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టుకుంటాడు. దీంతో జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే అతిథులుగా కొన్ని చోట్లకి ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్లకూడదట. అలా వెళ్తే జీవితంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. కొన్ని ప్రదేశాలను సందర్శించేటప్పుడు కొన్ని వస్తవులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మీకు కావలసిన, కొనుగోలు చేయగలిగిన అంటే మీ స్థొమతకు తగ్గట్లు ఏదైనా తీసుకెళ్లవచ్చు. అది మీకు మేలు చేస్తుంది.
ఖాళీ చేతులతో వెళ్లకూడదని కొన్ని ప్రదేశాలు
స్నేహితుల ఇల్లు
చాలా మంది స్నేహితుల ఇంటికి ఉత్త చేతులతో వెళ్తుంటారు. అయితే ఇలా చేయకూడదు. స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు వీలైనన్ని వస్తువులు తీసుకెళ్లాలి.
వివాహిత సోదరి ఇంటికి
పెళ్లి అయిన మీ అక్క లేదా చెల్లి ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లవద్దు. మీరు ఏదో దానితో అక్కడికి వెళ్లాలి.
దేవాలయాలు
ఎప్పుడూ ఖాళీ చేతులతో ఆలయానికి వెళ్లవద్దు. వీలైనంత వరకు పండ్లు లేదా స్వీట్లను తీసుకోవాలి.
గురువుగారి ఇల్లు
గురు మంత్రం ఉన్నవారు గురువుగారి ఇంటికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లరు. ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
పెళ్లయిన కూతురి ఇల్లు
పెళ్లయిన కూతురి ఇంట్లోకి ఎప్పుడూ రిక్తహస్తాలతో ప్రవేశించవద్దు. కూతురి ఇంటికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి మీ స్థాయికి తగ్గట్లు తీసుకెళ్లాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications