Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
100% రాసి పెట్టుకోండి.. ఉగాది తరువాత ఈ 6 రాశుల వారిని ఎవరూ ఆపలేరు, వారికి డబ్బే డబ్బు!
ఉగాది నుండి రెండు నెలలపాటు ఆరు గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా రాశి చక్రంలోని అన్ని రాశుల వారు తీవ్రంగా ప్రభావితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యం రాశి చక్రంలోని ఆరు రాశులు - వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకరం - ఈ ఏడాదిలో తమ తమ రంగాల్లో ప్రత్యేకమైన విజయం సాధించబోతున్నాయి.
ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలలో విపరీతమైన పురోగతి, ఆర్థిక అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు పొందడం, మంచి కుటుంబంలో పెళ్లి చేయడం వంటి అనేక విషయాలలో మంచి జరగనుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు మరియు తమ కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ విజయవంతం అవడంతో పాటు అనేక ప్రయోజనాలు చేకూరే సూచనలు గోచరిస్తున్నాయి. అయితే ఈ స్టోరీలో ఆ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం: ఉగాది తరువాత వృషభ రాశికి చెందిన వారి టైం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి వారికి సాధారణంగా భాగ్యాన్ని, అధికారాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు ఆ సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. లక్ష్యానికి మించి ఉద్యోగంలో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఉగాది తరువాత సంస్థల్లో అత్యున్నత పదవికి చేరుకునే అవకాశాన్ని పొందవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు ఉంటాయి మరియు ఆదాయం అనేక మార్గాలలో పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు మారడానికి అవకాశం ఉంది.
మిథునం: మిథున రాశికి చెందిన వారి జీవితం కూడా ఉగాది తరువాత తీవ్రంగా ప్రభావితం కానుంది. ఈ రాశికి చెందిన వారు తమ తమ వృత్తి, ఉద్యోగాల్లో కాకుండా సామాజికంగా కూడా ప్రాముఖ్యతను పెంచుకుంటారు. తమలోని నైపుణ్యాలతో నలుగురిని ఆకట్టుకుంటారు. ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అలాగే మంచి ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు విదేశాలకు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నారు. వారు కోరుకునే కోరికలు, ఆశలు సాధ్యం కావడం, విదేశాల్లో ఉద్యోగం, సొంత ఇల్లు, ఆస్తులు పెరగడం వంటి అనేక ఆశలు నెరవేర్చుకుంటారు. సంపన్న కుటుంబంలో పెళ్లి కూడా కుదురుతుంది.
కన్య: ఉగాది తరువాత అదృష్ట జాతకుల్లో కన్య రాశికి చెందిన వారు కూడా ఉన్నారు. ఉగాది నుంచి ఈ రాశి వారికి సంపద సొంతం అవుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. సొంత ఇల్లు కల నెరవేరుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి కూడా కుదురుతుంది. విద్యార్థులకు కూడా విజయాలు వస్తాయి, విదేశాల్లో ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయ. ఎటు చూసినా ఈ రాశికి చెందిన వారికి అన్నీ విజయాలే వారించనున్నాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ మాటలతో ఎదుటి వ్యక్తిని కట్టి పడేసే సామర్త్యాన్ని కట్టిపడేస్తారు.
తుల: ఈ రాశి వారికి కొత్త తెలుగు సంవత్సరంలో అనేక మంచి అదృష్ట యోగాలు పట్టుకోనున్నాయి. ఈ రాశికి చెందిన వారు తమ తమ ఉద్యోగంలో ఉన్నత స్థాయి పదవులు పొందుతారు. వారు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, వృత్తి, వ్యాపారాల్లో లాభం పెరుగుతుంది. సంపన్న కుటుంబంలో ప్రేమలో పడడం లేదా పెళ్లి చేసుకోవడం కూడా జరగవచ్చు. విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు కలుగుతాయి. డబ్బు వచ్చే మార్గాలు డబల్ అవుతాయి. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటుంది. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు అనుకూలత లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను ఇద్దరూ కలిసి నెరవేర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యలతో పాటు సమాజంలో కూడా గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. వారి నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. మొత్తంగా ఈ రాశికి చెందిన వారు రాశి కూడా కింగ్ మేకర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వృశ్చికం: గ్రహాలూ తమ రాశుల మార్చుకోవడం వలన ఈ సంవత్సరం వచ్చే ఉగాది తరువాత కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రాశికి చెందిన వారి ఆదాయం డబల్ అవుతుంది. వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలతో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తమ కోరికలు నెరవేరుతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ రాశికి చెందిన వారు రెండు చేతుల్లా డబ్బులు సంపాదిస్తారు. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా నెరవేర్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలను సంపాదిస్తారు. దీంతో పాటు తాము ఒక గొప్ప వ్యక్తిని తమకు తామే దర్శించుకుంటారు.
మకరం: ఉగాది తరువాత అద్భుతమైన ఫలితాలు పొందే రాశుల్లో మకర రాశి కూడా ఉంది. మకర రాశికి చెందిన వారి జాతకం మూడు పూలు ఆరు కాయలుగా మారబోతుంది. ఉగాది తరువాత మే చివరి వరకు మకర రాశి వారికి అత్యధిక అదృష్టం కలుగుతుంది. ఈ కాలంలో ఈ మకర రాశికి చెందిన వారి విపరీతమైన డబ్బు నీ సొంతంఅవుతుంది. అత్యధిక ఆదాయం వృద్ధి, ఉద్యోగులు మరియు వ్యాపారవేత్తలకు ఉన్నతమైన అవకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం లేదా పెళ్లి జరగవచ్చు. అనేక కోరికలు నెరవేరతాయి, ఆస్తి లాభం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. భాగస్వామి నుంచి ఆస్తికి సంబంధించిన దస్తావేజులు కూడా నీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఉగాది తరువాత మకర రాశికి చెందిన వారి జాతకం మొత్తం మారిపోతుంది. ఉగాదికి ముందు ఉగాది తరువాత అన్న విధంగా అద్భుతంగా మారిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications