Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
Horoscope Today: ఆ 3 రాశుల వారు అన్ని విషయాల్లో మోసపోతారు.. అందులో మీ రాశి కూడా ఉందా?
జోతిష్య శాస్త్రం ప్రకారం రాశి ఫలాలు మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. గ్రహాల గమనాల వలన రాశి ఫలాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈరోజు ఏ రాశి వారికీ బాగుండబోతుంది? ఏ రాశి వారికి చెడు రోజులు ఉండనున్నాయి? ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకుందాం.
మేష
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఈ రాశి జాతకులు ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కుటుంబ విషయాలపై కాస్త శ్రద్ధ పెడతారు. ఈ రాశి వారు ఈరోజు విలాసాల కోసం చాలా ఖర్చు చేస్తారు. వృత్తికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగులు తమ కార్యాలయంలో ఉన్నతాధికారుల మాటలు పట్టించుకోవద్దు.

వృషభం
ఈ రాశి వారు ఈరోజు తమ పని విషయమై కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఈ రాశి వారు ఈరోజు తమ గృహ సౌకర్యాల కోసం చాలా ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి వారి తొందరపాటు సమస్యలను పెంచుతుంది. అందుకే ఈరోజు వృషభ రాశి వారు కాస్త ఓర్పు, ధైర్యంతో ఉండాలి. ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టవద్దు. కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మిథున
ఈ రాశి వారికి ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. పనిలో ఎవరితోనూ అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. కుటుంబ విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. కార్యాలయంలో పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం ఉంటుంది.
కర్కాటక
ఈ రాశి వారు ఈరోజు తమ పనిలో తమ పని తీరును మెరుగ్గా ఉంచుకోగలుగుతారు. ఈ రోజు తమ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో మీరు మోసపోవచ్చు. స్నేహితుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగార్థులు కొత్త ఉద్యోగంలో మారే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి.
సింహ
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండనున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు కాస్త ఓపికగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలను మానుకోవాలి. అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. పిల్లల పురోగతికి తండ్రి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు అవుతుంది. తోటివారితో సంబంధాలు బాగుంటాయి. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఈరోజు మీ పాత స్నేహితుడిని కలుస్తారు. కొన్ని కొత్త ఉద్యోగాలపై మీ ఆసక్తి పెరుగుతుంది.
తులా
ఈ రాశి వారికి ఈరోజు వింత పరిస్థితులు ఉండనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిపై దృష్టి సారించాలి. మీ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. కొన్ని శారీరక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చిక
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మార్కెటింగ్ వ్యక్తులకు ఈరోజు శుభంగా ఉంటుంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. ఈ రాశి వారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను నేడు పరిష్కరించుకుంటారు. ఎవరి మాటలను నమ్మి మోసపోకూడదు. కొన్ని ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. అయితే ఇదే రోజు మీకు కొందరు కొత్త శత్రువులు పరిచయమయ్యే ఛాన్సుంది.
మకర
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుతుంటుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పనిలో సోమరితనం వద్దు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పురోగతికి ఆటంకాలు తొలగిపోతాయి. మీరు కార్యాలయంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు.
కుంభ
ఈ రాశి జాతకులు కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. మీ లక్ష్యాలు నెరవేరుతాయి. సహోద్యోగులతో హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఒకే విషయంపై ద్రుష్టి పెట్టాలి, లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీన
ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పూర్తికాకుండా ఉండిపోయిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఏ పనిలోనైనా తొందరపాటు మానుకోండి. ఉద్యోగులు తమ పనిలో చాలా చురుకుగా ఉంటారు. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











