Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
ఆగస్టులో ముఖ్య గ్రహాల సంచారం, ఆ రాశుల జీవితంలో పెను మార్పులు - మీరున్నారేమో చూస్కోండి!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో తమ స్థానాలను మార్చుకుంటాయి. నిమిష నిమిషానికి వీటిలో తేడా ఉందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సమయాన్ని, ప్రాంతాన్ని బట్టి కూడా వీటిలో మార్పు ఉంటుంది. అందుకే ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో పుట్టిన ఇద్దరి జాతకం కూడా చాలా వేరుగా ఉంటుంది. అయితే వచ్చే నెలలో మాత్రం పలు కీలక గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి.
ముఖ్యంగా ఆగస్టు నెలలో పెద్ద గ్రహాలు అయిన సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే నెలలో ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశుల వారు లాభం కలిసివస్తుందో.. ఆర్థికంగా, మానసికంగా, శారరీరకంగా ఎవరు ఎక్కుగ సంతోషంగా ఉండబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యసంచారం వల్ల లాభపడే రాశులివే:
వచ్చే నెలలో సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సూర్యుడిని గ్రహాల రాజుగా, అధిపతిగా చెబుతుంటారు. ఈయన నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఆగస్టు 17వ తేదీన సూర్య భగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడి సంచారం వల్ల మేషం, సింహం మొదైలన రాశులు వారికి చాలా బాగుంటుంది. వారు అనుకున్న కార్యాలను చేయగల్గుతారు. ముఖ్యంగా వచ్చే నెలలోనే శ్రావణ మాసం కూడా ఉంది. పెళ్లి జరగని వారికి ఈ సమయంలో కచ్చితంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది. అలాగే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా చాలా బాగవుతారు. కోర్టు, భూ సంబంధం సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.
శుక్రుడు సంచారం వల్ల లాభపడే రాశులివే:
శుక్రుడు కూడా నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. శుక్రుడు అనగానే లవ్, రొమాన్స్, సంపద గుర్తుకొస్తాయి. ఎందుకంటే వీటన్నిటికీ కారకుడు శుక్రుడే. జాతకంలో శుక్రుడు శభ స్థానంలో ఉంటే కచ్చితంగా జనాలు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆగస్టు 7వ తేదీ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది కన్యా, తులా, వృషభ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యంగా వీరు లగ్జరీ లైఫ్ ను ఆనందించబోతున్నారు. అలాగే ఇక్కడ చెప్పిన రాశుల వాళ్లు ప్రేమ విషయంలో, సెక్స్ విషయంలో చెలరేగిపోతారు. డబ్బుకు కూడా ఏమాత్రం కొదువ ఉండదు. అన్నీ రకాలుగా ఈ రాశుల వాళ్లు నెలంతా సంతోషంగా ఉంటారు.
అంగారక సంచారం వల్ల లాభపడే రాశులివే:
అంగారకుడిని గ్రహాలకు కమాండర్ గా చెబుతుంటారు. అయితే ఈయన కూడా ఆగస్టు నెలలో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఆగస్టు 17వ తేదీన కుజుడు తన రాశిని మార్చుకొని కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కజుడిని ధైర్యం, పరాక్రమం, భూమి - సంపదలకు కారకుడిగా భావిస్తారు. అంగారకుడి రాశి మార్పు వల్ల మేషం, కన్యా రాశుల వారికి మేలు జరగబోతుంది. ముఖ్యంగా ఈ రాశుల వాళ్లు భూ సంబంధ సమస్యలను అధిగమిస్తారు. విపరీతమైన సంపాదన కూడా రాబోతుంది. ధైర్య, సాహసాలతో మీరు సాధించాలనుకున్నవి చాలా వరకు ఈ నెలలో సాధిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications