Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డబ్బుకు లొంగరు..ఈ రాశుల వారికి ప్రేమే అన్నింటికన్నా ముఖ్యం,వీళ్లు దొరికితే అదృష్టమే
ఎవరినైనా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏదీ అని ప్రశ్నిస్తే చాలామంది డబ్బు అని ఠక్కున సమాధానం ఇచ్చేస్తారు. వాస్తవానికి డబ్బు శక్తివంతమైనదే కానీ దానికన్నా శక్తివంతమైనది మరొకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బు కంటే శక్తివంతమైనది ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారా? ప్రపంచంలో ప్రేమను మించిన శక్తివంతమైనది మరొకటి లేదు. డబ్బు ఎంత శక్తివంతమైనదైనా చివరికి ప్రేమే గెలుస్తుందన్న సత్యం మన చరిత్ర కూడా తెలియజేస్తుంది. ప్రేమ శక్తి అపారమైనది, అసమానమైనది. ప్రేమ సహాయంతో మీరు అత్యంత క్లిష్ఠ పరిస్థితులను కూడా అధిగమించగలరు.
ప్రేమ ఇంత పవర్ ఫుల్ అయినప్పటికీ చాలాసార్లు ప్రేమ,డబ్బు రెండింటిలో దేనిని ఎంచుకోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బే ముఖ్యం అని అనుకునేవాళ్ల సంఖ్య ఈ రోజుల్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వ్యక్తులు డబ్బు కన్నా ప్రేమే ముఖ్యంగా భావిస్తారు. ఏ రాశుల వ్యక్తులు అలా ఉంటారో ఇక్కడ చూడండి.

కర్కాటకం
కర్కాటక రాశి వ్యక్తులు డబ్బుు కంటే ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రేమనా లేదా డబ్బా అని అడిగాతే క్షణం ఆలోచించకుండా ప్రేమనే అంటారు. సహజంగానే కర్కాటక రాశి వ్యక్తులు ప్రేమగల వ్యక్తులు. వీరు అన్నింటికంటే మించి భావోద్వేగాలకు, భావాలకు విలువ ఇస్తారు. తమ ప్రియమైనవారు బాధపడటం ఎప్పటికీ భరించలేరు. ఎవరైనా వీరికి వేల కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినా అది అక్కర్లేదు ప్రేమ ఉంటే చాలు అని అనేకునే రకం వీళ్లు. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు.
సింహం
సింహ రాశి వారు సాధారణంగా డబ్బు కోసం అత్యాశ కలిగి ఉంంటారనేది వాస్తవం. అయితే డబ్బు కావాలా, ప్రేమ కావాలి అని అడిగితే మాత్రం తడబడకుండా ప్రేమనే కావాలి అని అంటారు. వీరు ఎల్లప్పుడూ ప్రేమకే ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తమ భాగస్వామి భావాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే జీవితమంతా పండుగలా ఉంటుంది.
కన్య
కన్య రాశి వారు వాస్తవికవాదులు, తార్కికంగా ఆలోచించేవారు. చాలా ఆచరణాత్మకంగా ఉండే కన్య రాశి వాళ్లు ప్రేమ విషయాల విషయానికి వస్తే తమ తర్కాన్ని పక్కన పెట్టి ప్రేమను ఎంచుకుంటారు. తమ ప్రియమైన వ్యక్తి ఆపదలో ఉంటే లేదా వారికి సహాయం అవసరమైతే వీరు ఎంత డబ్బు పోగొట్టుకున్నా వారి వద్దకు పరిగెత్తుతారు. కన్య రాశి వారు ప్రేమ విషయంలో చాలా మొండిగా ఉంటారు..కాబట్టి వీరు ఎవరి పట్ల తమ ప్రేమను ఎప్పటికీ వదులుకోరు. ఒక్కసారి మనస్ఫూర్తిగా కన్యరాశి వాళ్లు ప్రేమిస్తే ఇక చనిపోయేదాకా వారిని వదిలిపెట్టరు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తమ ప్రేమ, కోరికల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడూ డబ్బు గురించి ఎక్కువగా చింతించరు. డబ్బు వస్తుంటది,పోతుంటది కానీ ప్రేమనే శాశ్వతం అని గట్టిగా నమ్ముతారు. వృశ్చిక రాశి వారు నిరంతరం ప్రేమ కోసం చూస్తుంటారు. ఎవరైనా తమను చాలా ప్రేమిస్తున్నారని వారు భావిస్తే వారి కోసం ఏదైనా చేసే స్వభావాం కలిగి ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications