Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
2025లో ఈ రాశుల వారు అప్పులో ఊబిలో కూరుకుపోతారు.. ఏ దేవుడు వీరిని కాపాడలేరు!
కొత్త సంవత్సరం దగ్గరకు వస్తున్న కొద్దీ అందరూ 2025లో తమ జాతకం ఎలా ఉండబోతుంది అని తెలుసుకుంటున్నారు. ఏ రాశి వారికి 2025 బాగుండబోతుంది? ఏ రాశి వారికి 2025 కలిసి రానుంది అని ఇప్పటి వరకు అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే 2025లో ఈ రాశుల వారు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఎంత సంపాదించినా డబ్బులు మాత్రం మిగలవు. 2024తో పోలిస్తే 2025లో వీరి ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా మారబోతోంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రాశులు ఏవి? ఏ రాశుల వారు అప్పుల ఊబిలో కూరుకుపోతారు అనేది తెలుసుకుందాం.
మేష రాశి
2025లో మేష రాశికి చెందిన వ్యక్తులు ఊహించని విధంగా ఆర్ధిక ఒడిడుకులు ఎదుర్కొంటారు. ఇంత వరకు ఈ రాశి వారు సంపాదించుకున్నదంతా పోగుట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల కారణంగా అత్యధిక ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేతికి అందివచ్చిన మంచి అవకాశాలను వదిలేసుకోవడం వల్ల చాలా డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు 2025లో మానసిక, ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వారి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో అనిశ్చితి నెలకొంటుంది. దీని కారణంగా ఆర్ధిక అస్థిరత్వం నెలకొంటుంది. దీని కారణంగా ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. అనుభవం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. నమ్మిన వ్యక్తులే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చాలా డబ్బులు నష్టపోతారు.
తులా రాశి
ఈ రాశి వారికి 2025వ సంవత్సరం చాలా సవాలుతో కూడుకొని ఉంటుంది. శష మహాపురుష యోగం పూర్తయిన తరువాత ఈ రాశి వారికి కస్టాలు మొదలవుతాయి. పని స్థిరంగా ఉండదు. ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. వ్యాపారంలో సరిగ్గా బిజినెస్ జరగదు. దీని కారణంగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది. అలాగే సులభంగా డబ్బులు సంపాదించే మార్గంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తారు. దీని కారణంగా భారీగా డబ్బులను కోల్పోయే అవకాశం ఉంటుంది.
సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెడితే కచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నమ్మిన వ్యక్తులే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్రణాళిక బద్దంగా వ్యవహరించకపోతే నష్టాలు మీరు ఊహించని విధంగా ఉంటాయి.
మకర రాశి
మకర రాశి వారికి 2025లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మంచిగానే ఉన్నా ఆర్ధిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడం వల్ల చాలా నష్టపోతారు. పెట్టుబడులు పెట్టిన డబ్బులు తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిరాకుగా ఉంటూ ఎలాంటి ఫైనాన్సియల్ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్ధిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications