Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వరాల జల్లు కురిపించనున్న శని, శుక్రుడు.. ఈ రాశుల వారు మాత్రం అపర కుబేరులు అవుతారు!
శనీశ్వరుడు అధిపతిగా కొనసాగుతున్న కుంభ రాశిలో ఈనెల 28వ తేదీన శుక్రుడు ప్రవేశించనున్నాడు. అయితే కుంభ రాశి శుక్రుడికి కుంభరాశి మిత్రరాశి అవడం వలన శుక్రుడు తాను ఇవ్వాల్సిన ఫలితాల కంటే రెట్టింపు ఫలితాలను ఇస్తాడు. అలాగే అదే రాశిలో శని కూడా ఉండడం, వీరిద్దరూ కలవడం వల్ల వీరిద్దరూ కలిసి ఇచ్చే శుభపరిణామాలు ఏ శక్తి అడ్డుకోలేదు. దీని కారణంగా ఈ ఆరు రాశుల వారిని ఎవరూ అడ్డుకోలేరు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి వారికి లాభ స్థానంలో శుక్ర, శని గ్రహాల యుతి జరుగుతుంది. దీని వల్ల వీరికి ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. దాదాపు ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. అలాగే భారీగా జీతం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో భారీగా ఆదాయ వృద్ధి జరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సంపన్న కుటుంబాలతో పెళ్లి ఖరారవుతుంది.

వృషభం
ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పదో స్థానంలో ఉన్న శనీశ్వరుడితో కలుస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి శషమహాపురుష యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశికి చెందిన వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో రాజయోగం ఏర్పడుతుంది. వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయి.
మిథునం
ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఈ రెండు గ్రహాలు కలుస్తున్నాయి. దీని కారణంగా విదేశాలకు వెళ్లాలని అనుకునే వ్యక్తుల కల నెరవేరుతుంది. విదేశాలకు చెందిన వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మాత్రమే కాదు, వేరే ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. వారసత్వ సంపద లభిస్తుంది. సమాజంలో గుర్తింపుతో పాటు గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభదాయంగా మారుతుంది. ఆదాయం కూడా భారీగా వృద్ధి చెందుతుంది.
తుల
ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడిని కలవడం వల్ల.. విపరీతమైన రాజయోగాలు ఏర్పడతాయి. ప్రముఖులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందడంతో పాటు భారీగా జీతం పెరిగే అవకాశం ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వచ్చి పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మకరం
ఈ రాశి వారికి ధన స్థానంలో ఉన్న శని, శుక్ర గ్రహాల యుతి జరగడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆదాయం కూడా అనేక విధాలుగా వచ్చి చేరుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందడంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషకరంగా మారుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
కుంభ
ఈ రాశిలోనే శుక్ర, శని గ్రహాల కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా విపరీతమైన రాజయోగాలు పట్టుకుంటాయి. వీరికి ఉన్న ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. పనిభారం తగ్గడంతో పాటు ఆదాయం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు లభించడంతో పాటు సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications