Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఒకేసారి పది అదృష్ట యోగాలు.. 2025 జనవరి 1 నుంచి ఈ 5 రాశుల వారు రిచ్ అవుతారు
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి చక్రాల్లో మార్పులు అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా పలు రాశుల వారికి శుభపరిణామాలు చోటు చేసుకుంటే, మరి కొన్ని రాశుల వారికి తీవ్రమైన నష్ట పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే జనవరిలో పలు గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. బుధుడు, శుక్రుడు, తమ తమ రాశులను రెండు రెండుసార్లు మార్చుకోనున్నారు.
దీని కారణంగా పలు శుభ, అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల స్థానాల వల్ల జనవరిలో శశరాజయోగం, లంబత్ యోగం, బుదాదిత్య రాజయోగం, త్రిగ్రహ యోగం వంటి యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఆరు రాశులకు చెందిన వ్యక్తులు భారీగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారికి జనవరి నెల చాలా బాగుంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. ఉద్యోగులు కొందరికి పదోన్నతి, జీతాల పెంపు జరుగుతుంది. వ్యాపారం చేసే వారికి భారీగా లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
మిధున రాశి
మిథునరాశి వారికి 2025లో జనవరి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈనెలలో ఉద్యోగులకు అనేక ఊహించని ప్రయోజనాలను అందుతాయి. వ్యాపారులకు భారీగా లాభాలు చేకూరతాయి. ఆర్ధిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ వాతావరణం బాగుటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన జీవితం గడుపుతారు.
సింహ రాశి
2025 జనవరి నెల సింహరాశి వారికి అదృష్ట నెల అని చెప్పుకోవచ్చు. ఈనెల ఈ రాశికి చెందిన ఉద్యోగుల పురోగతికి అనేక అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు అన్ని రంగాలలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ నెలలో చేపట్టే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి 2025 జనవరి నెల అత్యంత సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం మధురంగా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి 2025 జనవరి నెల అత్యంత అదృష్టవంతమైన మాసంగా మారబోతుంది. ఈ నెలలో ఈ రాశి వారు మంచి భౌతిక ఆనందాన్ని పొందుతారు. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీ ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications